అమరావతికి ఇక నుంచి - కేంద్రం కీలక నిర్ణయం..!!

ఏపీ రాజధాని అమరావతి పై వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రాజధానికి రూ 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసాయి. ఇదే సమయంలో అమరావతికి రోడ్డు, రైలు కనెక్టివిటీ పైన కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశమైన వేళ అమరావతి కనెక్టివిటీ పైన కీలక హామీ దక్కింది.

అమరావతి కోసం
తన ఢిల్లీ పర్యటనలో భాగంగా మొదటి రోజు బిజీగా గడిపిన చంద్రబాబు, ఈ రోజు కూడా వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సమవేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు కూడా పాల్గొన్నారు.. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ, అమరావతి - హైదరాబాద్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్ప్రెస్‌ వే, అమరావతి-రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ సహా రాష్ట్రంలోని పలు ఇతర జాతీయ రహదారుల గురించి చర్చించారు.

Nitin Gadkari assurance for Chandra Babu over Road connectivity for Amaravati

కేంద్రం హామీ
అదే విధంగా.. రాజధాని అమరావతికి అన్ని జిల్లాల కనెక్టివిటీ, అమరావతి - హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అమరావతి - రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ వంటి కీలక అంశాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రతిపాదనలను గడ్కరీకి సమర్పించారు. నిధుల కేటాయింపు తో పాటుగా రాజధాని నిర్మాణంలో భాగంగా కనెక్టివిటీ ఏర్పాటు పైన చర్చించారు. ఈ సమయంలో గడ్కరీ నుంచి చంద్రబాబుకు హామీ దక్కింది. తన శాఖ నుంచి అమరావతికి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జాతీయ రహదారికి అమరావతి కనెక్టివిటీ దిశగా ఇప్పటికే చేసిన నిర్ణయాలు..అమలు ప్రతిపాదనల గురించి ఇద్దరూ చర్చించారు.

వరుస భేటీలు
ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమార స్వామితో భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అంశం పైన చర్చిస్తున్నారు. సెయిల్ లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విలీన ప్రతిపాదనల పైన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశం పైన ప్రధానితోనూ చంద్రబాబు చర్చించారు. ఇక, సాయంత్రం 4:30కు కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో,5:45కు కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో చంద్రబాబు సమావేశం అవుతారు. రాత్రి 8 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, రాత్రి 11:15కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ చంద్రబాబు భేటీ కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+