TTD: శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులను తనిఖీ చేసిన అదనపు ఈవో

తిరుమలలోని శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలను ఆదివారం సంబంధిత అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో నాలుగు మాడ వీధుల్లో ఉన్న వివిధ ప్రవేశ, నిష్క్రమణ, హారతి పాయింట్ల గురించి తెలుసుకోవడానికి టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అన్ని గ్యాలరీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

వాహన మండపం నుంచి ప్రారంభమై నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలు, తిరుమల నంబి ఆలయం వద్ద కదిలే వంతెన, గ్యాలరీల వద్ద ప్రవేశ నిష్క్రమణ పాయింట్లు మరియు ఇతర సంబంధిత సమాచారాన్ని అధికారులు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి వివరించారు. ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో నంద కిషోర్ తో పాటు ఇతర అధికారులకు పలు సూచనలు చేసిన టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలని సూచించారు.

No change in senior Citizen Darshan in Tirumala

తిరుమలలో వయోవృద్ధులకు దర్శనం

తిరుమలలో శ్రీవారిని వయోవృద్ధుల దర్శించుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవం అని టీటీడీ తెలిపింది. వాస్తవం ఏమిటంటే, ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది.

టికెట్ పొందిన వ్యక్తికి రూ. 50 లడ్డూ ఒకటి ఉచితంగా లభిస్తుంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్‌సీ లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కావున సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నది.

భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని టీటీడీ మనవి చేసింది. కొంతకాలంగగా సోషల్ మీడియాలో కొందరు కావాలనే తిరుమల పవిత్రను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ అధికార వెబ్ సైట్ మాత్రమే చూస్తే పూర్తి సమాచారం తెలుస్తోందని టీటీడీ అధికారులు, సిబ్బంది అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+