ఆ శకలాలు ఏఎన్ 32వి కావు, ఇంకా దొరకలేదు: పారికర్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళ్తూ అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎఎన్ 32 ఆచూకీ ఇంకా లభించలేదు. విమానాలు, నౌకలు, జలాంతర్గాములు అహోరాత్రులు గాలిస్తున్నా ఆచూకీ దొరకలేదని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గురువారం లోకసభలో చెప్పారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అదృశ్యం: బంగాళాఖాతంలో శకలాలు అవేనా?

ఈ నెల 22వ తేదీన ఎఎన్ 32 విమానం గల్లంతైన విషయం తెలిసిందే. రక్షణ మంత్రి పారికర్ లోకసభలో విమానం అదృశ్యంపై తనంతట తానుగా ఓ ప్రకటన చేశారు. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు.

No concrete evidence about missing AN-32 plane: Manohar Parrikar

ఉపరితలం అలాగే సముద్ర గర్భంలోనూ విస్తృతంగా గాలింపు జరుగుతోందన్నారు. 13 నౌకలు, 4 కోస్ట్ గార్డ్ నౌకలు, ఒక జలాంతర్గామి ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయన్నారు. అన్ని కోణాల్లోనూ గాలింపు జరుపుతున్నామన్నారు.

మంత్రి సముద్రంపై తేలియాడుతూ కనిపించిన చమురుతెట్టు వంటివాటిని నిపుణులు పరిశీలించినా ఫలితం లేకపోయిందన్నారు. ఆ ప్రాంతంలో తేలియాడుతూ 22 వస్తువులు కనిపించాయని అయితే అవి మిస్సయిన విమానానికి సంబంధించినవి కాదని నిర్ధారణ అయిందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
"Several inputs and leads" regarding floating objects have been picked up but there is no concrete evidence so far with respect to missing AN-32 aircraft of the IAF, Defence Minister Manohar Parrikar told the Lok Sabha on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X