అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైద్య విద్యార్థుల డ్రస్ కోడ్ నిబంధన లేదు

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైద్య విద్యార్ధులు టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు ధరించకూడదంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. మెడిసిన్ విద్యార్ధినులతో పాటు అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు చీర లేదా చుడీదార్లు మాత్రమే ధరించాలన్నారు.

ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు నీట్‌గా డ్రెస్ చేసుకోవాలని, క్లీన్ షేవ్‌తో రావాలని, మహిళలైతే జుట్టును వదులుగా వదిలేయకూడదని వైద్య విద్య సంచాలక కార్యాలయం(డీఎంఈ) కొన్ని సూచనలు చేసింది. తప్పనిసరిగా స్టెతస్కోప్, యాప్రాన్ ధరించాలని డీఎంఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా వైద్య విద్యార్ధుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

no dress code for medical students in ap

తాజాగా దీనిపై వైద్య విద్య కమిషనర్ కార్యాలయం వివరణ ఇచ్చింది. మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. వైద్య విద్యార్ధులు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదంటూ ఇంటర్నెట్, మీడియా వర్గాల్లో వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. పూర్తి అవాస్తవం అని వైద్య విద్య కమిషనర్ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. వైద్య విద్యార్ధులకు ఎటువంటి డ్రెస్ కోడ్ తీసుకురాలేదంటూ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

English summary
Medical students in AP are not allowed to wear t-shirts and jeans, news is doing the rounds on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X