చిరు ముందు ఆఫ్షన్స్, బిజెపిలో చేరడం లేదని రుద్రరాజు

చిరు ముందు మూడు ఆప్షన్స్!
చిరంజీవి ముందు ప్రస్తుతం మూడు రకాల ఆప్షన్స్ ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. చిరు బిజెపిలో చేరుతారనే ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో 150వ సినిమా పైన కూడా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో.. సినిమాలు తీస్తూ కాంగ్రెసులో కొనసాగడం, 2019 టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించడం, పూర్తిగా సినిమాల పైనే దృష్టి సారించడంలో చిరు ఏం చేస్తారనే ఆసక్తి అందరిలోను నెలకొంది.
ఇప్పటికే సినిమాలు, రాజకీయాల పైన తర్జన భర్జన పడుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాల పైన పూర్తిగా దృష్టి సారించాలా లేక రాజకీయాల పైన సారించాలా అనే విషయమై ఎటు తేల్చుకోలేకపోతున్నారట. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18 స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేశారు.
అనంతరం కాంగ్రెసు పార్టీ ఆయనను రాజ్యసభకు పంపించి... పర్యాటక శాఖను అప్పగించింది. ఇప్పుడు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెసు పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో కనీసం ఒక్క ఎమ్మెల్యే, ఒక్క పార్లమెంటు స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఇక కేంద్రంలో ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేని పరాభవం ఎదురైంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెసు పార్టీలో చిరంజీవి స్థానంపై అభిమానుల్లో, సీమాంధ్ర కాంగ్రెసులో జోరుగా చర్చ సాగుతోంది.
మరో ఐదేళ్ల వరకు చిరంజీవికి ఎక్కువ శాతం విశ్రాంతే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో చిరు 150 సినిమా పైన దృష్టి సారిస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో సినిమా పైన దృష్టి సారించాలా లేక 150వ సినిమా పూర్తయ్యాక రాజకీయాల పైన దృష్టి పెట్టాలా, రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారిస్తే బిజెపిలో చేరుతారా లేక కాంగ్రెసులో కొనసాగుతారా అనే చర్చ సాగుతోంది. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం బిజెపిలో చేరే ప్రచారాన్ని కొట్టి పారేస్తోంది.
-
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications