కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి 5కోట్ల విలువైన, 6కిలోల బంగారం బహుమానం ఇచ్చిన ఎన్నారైలు!!
విఘ్నాలు అన్నింటినీ తీర్చే వినాయకుడు, కోరిన వరాలను ఇచ్చే వరసిద్ధి గణపతి కాణిపాకం గణపయ్య. సత్య ప్రమాణ దైవంగా ప్రజలందరూ కొలుచుకునే కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి అత్యంత భక్తిశ్రద్ధలతో ఇద్దరు దాతలు భారీ విరాళాన్ని సమర్పించారు. ఆరు కిలోల బంగారాన్ని స్వామివారికి సమర్పించి స్వామివారి పట్ల తమ భక్తిని చాటుకున్నారు.
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ అనే ఇద్దరు ఎన్నారైలు 20 బంగారు బిస్కెట్లను కానుకగా అందజేశారు. వీరు స్వామి వారికి అందించిన కానుకల విలువ ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. మొత్తం ఆరు కిలోల బంగారాన్ని స్వామివారికి సమర్పించిన సదరు భక్తులు ఇప్పటికే కాణిపాకం ఆలయం పునర్నిర్మాణం కోసం భారీ విరాళాలను అందజేస్తున్నారు.

ఎన్నారైలు సమర్పించిన బంగారు బిస్కెట్లను స్వామివారి అంతరాలయం, బంగారు వాకిలి నిర్మాణానికి ఆలయ అధికారులు ఉపయోగించనున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో బావిలో వెలసిన వినాయకుడు, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన వరసిద్ధి వినాయకుడు. కోరినంతనే కోరికలు తీర్చే ఈ వరసిద్ధి వినాయకుడికి భక్తులు సమర్పించే విశేష కానుకలు, ఆలయ అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు.
ఇదే క్రమంలో తాజాగా స్వామివారికి 6 కిలోల బంగారాన్ని ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ లు ఇస్తున్న క్రమంలో వారిని ఘనంగా స్వాగతించి, స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేసి వేదపండితులు ఆశీర్వచనం పలికారు.
ఇక స్వామివారికి ఎన్నారైలు భారీ విరాళం ప్రకటించడం పట్ల ఆలయ ఈవో వెంకటేష్, ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. స్వామికి భారీ బహుమానం ఇచ్చిన ఎన్నారైలు కాణిపాకం వరసిద్ధి వినాయకుడి అభివృద్ధికి తాము ఎల్లప్పుడు సహకారం అందిస్తామని ఆలయ అధికారులకు తెలిపారు.స్వామివారి బంగారు వాకిలి తాపడానికి అయ్యే ఖర్చు 5 కోట్లు తాము ఇస్తామని, వెంటనే పనులు మొదలు పెట్టాలని వారు సూచించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications