చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఎన్టీఆర్ దూరం..?
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. జనసేన ,బీజేపీ పార్టీలతో కలిసి పోటీ చేసిన టీడీపీ 164 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. 151 సీట్లతో ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఇక కూటమి ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు అనగా బుధవారం జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు సైతం హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందిందా లేదా అనే దానిపై సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

ఒకవేళ ఆహ్వానం అందితే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. టీడీపీ తరపున ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందినా ఆయన వచ్చే అవకాశాలు లేవన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అలాంటి సమయంలో స్పందించని ఎన్టీఆర్ ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు తక్కువని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అయితే కూటమి విజయం సాధించిన తర్వాత కూటమి నేతలకు అభినందనలు తెలుపుతూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. .ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని స్పెషల్ పోస్ట్ చేశారు. ఇక ఎన్టీఆర్ పోస్టుపై చంద్రబాబు కూడా స్పందించారు. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.












Click it and Unblock the Notifications