' లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ పెళ్ళి నాకేం సంబంధం, పవన్ ఎమోషనల్, రాజకీయవేత్తకాదు'
ఎన్టీఆర్ తో లక్ష్మీపార్వతికి తాను వివాహం జరిపించాననే ప్రచారంలో వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకొన్న ఘటనను ఆయన
నెల్లూరు: ఎన్టీఆర్ తో లక్ష్మీపార్వతికి తాను వివాహం జరిపించాననే ప్రచారంలో వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకొన్న ఘటనను ఆయన బయటపెట్టారు.
1994 అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ వివాహం చేసుకొన్నాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించింది. పార్టీ స్థాపించిన సమయంలో గెలిచిన సీట్ల కంటే అత్యధిక సీట్లను 1996 ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకొంది.
అయితే ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవడాన్ని కొందరు పార్టీ నాయకులు వ్యతిరేకించారు.అయితే కొందరు నాయకులు ఆయన వివాహం చేసుకోవడాన్ని సమర్థించారని ప్రచారం ఉంది.అయితే ఈ విషయమై పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆనాడు జరిగిన ఘటనలు బయటపెట్టారు.

లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ పెళ్ళి ప్రకటన
తిరుపతిలో జరిగే పార్టీ సమావేశానికి ఎన్టీఆర్ తో పాటు పార్టీ సీనియర్లంతా వెళ్ళాం. అయితే మాధవరెడ్డి, ఇంద్రారెడ్డి ఇతర నేతలంతా పార్టీ సమావేశం వేదిక కింద కూర్చొన్నాం.
ఎన్టీఆర్ వేదికపై కూర్చొన్నారు. అయితే ఎన్టీఆర్ తో పలువురు పార్టీ సీనియర్లు చెవిలో పది నిమిషాల పాటు చర్చించారు.అయితే పార్టీ సీనియర్ల మాటలకు ఎన్టీఆర్ తల అడ్డంగా ఊపారు.చంద్రబాబుతో సహ పార్టీ నాయకులంతా ఎన్టీఆర్ ను ఒప్పించే ప్రయత్నం చేశారుకాని, ఆయన వినలేదు.కొంత సేపటి తర్వాత పార్టీ నాయకులందరినీ కిందకు పంపాడు ఎన్టీఆర్. లక్ష్మీ ..పైకి రా అంటూ ఎన్టీఆర్ పిలిచారని గుర్తు చేసుకొన్నారు. అయితే లక్ష్మీపార్వతిని పెళ్ళి చేసుకొంటానని ఆయన ప్రకటించారు.

లక్ష్మీపార్వతిని పెళ్ళి చేసుకొనే విషయం తెలియదు
లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్ళిచేసుకొంటానని ప్రకటించేవరకు తనకు ఆ విషయమే తెలియదన్నారు.అలాంటి తనకు ఎన్టీఆర్ తో లక్ష్మీపార్వతికి తాను ఎలా వివాహం చేస్తానని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
ఎన్టీఆర్ వద్ద తామంతా చిన్న పిల్లల మాదిరిగా ఉండేవాళ్ళమని, ఆయన తనను విపరీతంగా అభిమానించేవాడని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.ఎన్టీఆర్ తో పర్సనల్ విషయాలు మాట్లాడేంత ధైర్యం , అవకాశం తమకు లేదన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

పవన్ ఎమోషనల్ పొలిటీషన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టిడిపియే ప్రమోట్ చేస్తోందనే ఆరోపణలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొట్టిపారేశారు. జనసేనను టిడిపి ప్రమోట్ చేయాల్సిన అవసరమే లేదన్నారు. పవన్ పక్కా పొలిటీషయన్ కాదన్నారు. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పర్సన్ అని సోమిరెడ్డి చెప్పారు. జనసేన పేరుతో రాజకీయ పార్టీ పెట్టడం పవన్ కళ్యాణ్ స్వంత నిర్ణయమన్నారు.

జగన్ ప్రతిపక్షనాయకుడు కాదు, ప్రతినాయకుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జగన్ పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. జగన్ ప్రతిపక్షనాయకుడు కాదన్నారు. జగన్ ప్రతి నాయకుడు అని చెప్పారు.భాష, పదవి, వయసు విషయంలో జగన్ తీరు భిన్నంగా ఉంటుందన్నారు.అందుకే జగన్ ను ప్రతినాయకుడిగా భావిస్తున్నామన్నారు.జగన్ పద్దతిని మార్చుకోవాలన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

ఎమ్మెల్సీగా మంత్రి పదవి స్వీకరిస్తే తప్పేంటీ?
ఎమ్మెల్సీగా నారాలోకేష్ మంత్రి పదవిని స్వీకరిస్తే తప్పేంటని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ సింగ్ దేశాన్ని పరిపాలించాడని చెప్పారు.నారాలోకేష్ ఎమ్మెల్సీగా మంత్రిపదవినికి స్వీకరిస్తే తప్పేమిటన్నారు.

పార్టీ నాయకులు వ్యతిరేకించిన లక్ష్మీపార్వతితో పెళ్ళి ప్రకటన
ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్ళి చేసుకొంటారనే విషయం పార్టీ నాయకుల్లో చాల మందికి తెలియదు.అయితే పార్టీ వేదికపైనే తాను లక్ష్మీపార్వతిని వివాహం చేసుకొంటానని ఎన్టీఆర్ ప్రకటించాలనే నిర్ణయంపై పార్టీ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని సోమిరెడ్డి గుర్తు చేశారు.అయితే తాను తీసుకొన్న నిర్ణయాన్ని ఎన్టీఆర్ అమలు చేశారని ఆయన ప్రస్తావించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications