హైదరాబాదులో ఒబామా హెలికాప్టర్ విడిభాగాల తయారీ
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉపయోగించే హెలికాప్టర్ విడిభాగాలు ఇక నుంచి హైదరాబాదులో తయారు కానున్నాయి. అమెరికాకు చెందిన పలు కంపెనీలు హైదరాబాద్ పరిసరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, వాటిలో అధ్యక్షుడి హెలికాప్టర్ విడిభాగాలు తయారు చేసే సంస్థ కూడా ఉందని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వరమ్ తెలిపారు.
మంగళవారంనాడు హైదరాబాద్ వచ్చిన రిచర్డ్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో విద్యుత్తు సరఫరా గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు హైదరాబాదుతో అమెరికాకు అవినాభావ సంబంధం ఉందని రిచర్డ్ వర్మ చెప్పారు.

పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా కలుసకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ రిచర్డ్ వర్మను ఘనంగా సత్కరించారు. ఆయనకు కాకతీయ తోరణాన్ని బహూకరించారు. ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో మరో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.
వచ్చే ఏడాది మెట్రో నెలలో మెట్రో రైలు మొదటి దశ ప్రయాణాలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. మెట్రో రైలు మార్గాన్ని మొత్తం 200 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రణఆలికా సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్‌తో రాష్ట్రాలకు భాగస్వామ్యం పెరిగిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications