పవన్ కల్యాణ్ "వారాహి" పై కొత్త ట్విస్ట్ - వాటిపైనా అభ్యంతరాలు..!?
కొద్ది రోజులుగా రాజకీయ చర్చగా మారిన పవన్ కల్యాణ్ ప్రచార వాహనం వారాహి వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. పవన్ తన ఎన్నికల ప్రచారం రధంగా వారాహి సిద్దమని ప్రకటించారు. దీని పైన వైసీపీ నేతలు కొత్త అంశం తెర పైకి తెచ్చారు. ఆర్మీవినియోగించే ఆలివ్ గ్రీన్ కలర్ సాధారణ వ్యక్తులు వినియోగించకూడదంటూ అమల్లో ఉన్న నిబంధనలను ప్రస్తావించారు. దీని పైన పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు వారాహి రిజిస్ట్రేషన్ ను అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.

వారాహి రిజిస్ట్రేషన్ వాయిదా
ఏపీలో రాజకీయ చర్చగా మారిన పవన్ కల్యాణ్ ప్రచార రధం వారాహి అంశంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలకు సంబంధించి వారాహి..రెడీ ఫర్ బ్యాటిల్ పేరుతో తన ప్రచార రధాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టులో చేసారు. ఈ వాహనంలో సకల సౌకర్యలు సమకూర్చారు.
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు చేసి వినియోగంలోకి తేవాలని నిర్ణయించారు. ఇదే సమయంలో వాహనం కోసం వినియోగించిన రంగు పైన చర్చ మొదలైంది. వారాహికి వినియోగించిని ఆలీవ్ గ్రీన్ ఆర్మీ వినియోగించేది కావటంతో..చర్చ మొదలైంది. ఆలివ్ గ్రీన్ కాకుండా పసుపు రంగు వేసుకోవాలంటూ వైసీపీ మాజీ మంత్రులు సెటైర్లు వేసారు. దీని పైన స్పందించిన పవన్ తన సినిమాలు అడ్డుకున్నారని.. విశాఖ లో కార్యక్రమాలకు అడ్డుపడ్డారని, ఇప్పుడు వాహనం కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

రంగుతో పాటు మరిన్ని అంశాల పైనా
ఇప్పుడు తాజాగా మరో అంశం తెర మీదకు వచ్చింది. వారాహి రిజిస్ట్రేషన్ చేయటానికి కొన్ని అభ్యంతరాలను అధికారులు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వాటిని సరి చేసిన తరువాత రిజిస్ట్రేషన్ కు అభ్యంతరం లేదని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. అందులో ప్రధానంగా ఆలివ్ రంగు వినియోగంతో పాటుగా లారీ చాసిస్ ను బస్సుగా మార్చిన అంశాన్ని అధికారులు ప్రస్తావించారు.
వాహనం ఉండాల్సిన ఎత్తు కంటే ఎక్కువ ఉండటం గురించి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మైన్స్ లో వాడాల్సిన వాహనాల టైర్లను రోడ్డుపై వెళ్లే వాహనానికి వాడటం వంటి వాటి పైన అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు..ఇవి నిబంధనలకు విరుద్దంగా పేర్కొన్నట్లు సమాచారం. వీటిని సరి చేసే వరకూ రిజిస్ట్రేషన్ వాయిదాకు సూచించారని చెబుతున్నారు. తాము సూచించిన విధంగా మార్పులు చేస్తే రిజిస్టేషన్ చేయగలమని అధికారులు వెల్లడించినట్లు సమాచారం.

జనసేనాని ఏం చేయబోతున్నారు..
వచ్చే ఎన్నికల్లో ప్రచారం కోసం చాలా రోజులుగా పవన్ కల్యాణ్ ఈ ప్రచార రధం సిద్దం చేయిస్తున్నారు. ఈ వాహనంలో కొత్త హంగులు .. ఆదునిక టెక్నాలజీతో తీర్చి దిద్దారు. వాహనం లోపల సౌకర్యాలతో పాటుగా లైటింగ్ - సౌండ్ సిస్టమ్ ప్రచారానికి వీలుగా సిద్దం చేసారు.
అయితే, వాహనం కోసం వినియోగించిన ఆలివ్ గ్రీన్ రంగు మొటార్ వెహికల్ చట్టం 1989 చాప్టర్ 121 ప్రకారం భారత ఢిఫెన్స్ విభాగం మినహా ఇతరులు వినియోగించే అవకాశం లేదు. దీని పైన మొదలైన చర్చ..ఇప్పుడు అధికారులు తాజా అభ్యంతరాల తో కొత్త టర్న్ తీసుకుంటోంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం పైన జనసేన నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.












Click it and Unblock the Notifications