Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వంగవీటి రాధాకి మరోసారి జగన్ షాక్:"ఆ రెండు సీట్లు"లో ఒకటి భర్తీ...ఇక నో ఛాయిస్!

విజయవాడ:వంగవీటి రాధాకి వైసిపి అధినేత జగన్ మరోసారి షాక్ ఇచ్చారు. తాను రాధాకి ఇచ్చిన 'ఆ రెండు సీట్లలో ఒకటి ఆఫర్'పై అతడి నుంచి స్పందన లేకపోవడంతో తానుఆఫర్ చేసిన రెండు సీట్లలో ఒక దాన్ని భర్తీ చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

Recommended Video

    ఎవరితో విభేదాల్లేవు.. జగన్ ఆదేశిస్తేనే !

    దీంతో ఇక వంగవీటి రాధాకి ఛాయిస్ పోయి ఒకే ఒక అవకాశం మిగిలింది. అది విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం. దీంతో జగన్ తాజా నిర్ణయంపై వంగవీటి రాధా స్పందన ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు విజయవాడ తూర్పు నుంచి టికెట్ ఆశిస్తున్న యలమంచిలి రవి ఆ సీటు వంగవీటి రాధా కాదంటేనే తనకు ఇవ్వమని, రాధా ఇక్కడనుంచి పోటీ చేస్తే సంపూర్ణ సహకారం అందచేస్తానని స్పష్టం చేశారని సమాచారం.

    రాధాకి...జగన్ మరోసారి షాక్

    రాధాకి...జగన్ మరోసారి షాక్

    తనకు విజయవాడ సెంట్రల్ సీటే కావాలని పట్టుబడుతున్న వంగవీటి రాధాకుఆ సీటును మాల్లాది విష్ణుకు కేటాయిస్తూ వైసిపి అధినేత జగన్ గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో వంగవీటి రాధా మనస్థాపం చెంది అలక వహించగా జగన్ ఆయనకు విజయవాడ సెంట్రల్ సీటు మాల్లాదికేనని...రాధా కావాలంటే
    విజయవాడ తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ స్థానం లేదా మచిలీపట్నం పార్లమెంట్ స్థానం...ఈ రెండింటిలో ఒక సీటు ఎంచుకొని అక్కడ నుంచి పోటీ చేయవచ్చని ఆఫర్ ఇచ్చారని పార్టీ శ్రేణుల సమాచారం.

    బాలశౌరికి...ఆ ఎంపి సీటు

    బాలశౌరికి...ఆ ఎంపి సీటు

    అయితే జగన్ ఇచ్చిన ఈ ఆఫర్ పై ఇప్పటివరకు వంగవీటి రాధా ఎలాంటి నిర్ణయం తెలపకపోగా...తనకు విజయవాడ సెంట్రల్ కేటాయిస్తారేమోనని వేచిచూసే ధోరణి కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ నుంచి వెలువడిన అనూహ్య నిర్ణయం వంగవీటి రాధాకి మరోసారి షాక్ లా తగిలింది. రాధాకి ఇచ్చిన రెండు సీట్ల ఛాయిస్ లో మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి మాజీ ఎంపీ బాలశౌరిని అభ్యర్థిగా ప్రకటిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వంగవీటి రాధాకి ఛాయిస్ పోయి ఓన్లీ విజయవాడ తూర్పు నియోజకవర్గం సీటు మాత్రమే అవకాశంగా మిగిలింది.

    అదే ముఖ్యం...తేల్చేశారు

    అదే ముఖ్యం...తేల్చేశారు

    తద్వారా తనకు గెలుపే ముఖ్యం తప్ప తాను ఇతర ఏ అంశాలు పట్టించుకోనని జగన్ మరోసారి స్పష్టం చేసినట్లయిందని వైసిపి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
    ఇప్పటికైనా వంగవీటి రాధా తాను తూర్పు నియోజకవర్గం నుంచి పోటీకి సిద్దమని వంగవీటి రాధా నుంచి అంగీకార ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారని, ఒకవేళ ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీకి వ్యతిరేకత వ్యక్తం చేస్తే ఆ సీటు ను కూడా జగన్ త్వరలోనే భర్తీ చేయొచ్చని చెప్పుకుంటున్నారు.

    యలమంచిలి రవి...సానుకూలం

    యలమంచిలి రవి...సానుకూలం

    అయితే వంగవీటి రాధాకి విజయవాడ తూర్పు నియోజకవర్గమే ఛాయిస్ గా మిగిలిన క్రమంలో ఈ సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే జగన్ తాజా నిర్ణయంపై మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి సానుకూలంగా స్పందించారు. తాను పార్టీ అధినాయకత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని...వంగవీటి రాధ తూర్పు నుంచి పోటీ చేస్తే ఆయన గెలుపుకు కృషి చేస్తానని, నా పూర్తి మద్దతూ రాధకు ఉంటుందని యలమంచిలి రవి స్పష్టం చేశారని తెలిసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+