సేఫ్ సెక్స్‌తో క్యాన్సర్‌ను అరికట్టవచ్చు: అపోలో వైద్యులు

హైదరాబాద్: భద్రమైన శృంగారం చేయడం వల్ల క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చని హైదరాబాద్‌కు చెందిన క్యాన్సర్ వ్యాధి నిపుణులు పేర్కొంటున్నారు. ప్రమాదకరమైన వ్యాధులకు ఇలాంటి శృంగారమే ఔషధంగా పని చేస్తుందని వారు చెబుతున్నారు. అయితే అసహజ శృంగారం మంచిది కాదని తెలిపారు. ఓరల్ సెక్స్ ద్వారా ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Oncologists call for safe sex practices to prevent cancer

యశోదా ఆస్పత్రి సీనియర్ అంకాలజిస్ట్ డాక్టర్ భరత్ వశ్వాని మాట్లాడుతూ.. టొబాకో వాడటం వల్లే కాక.. ఓరల్ సెక్స్, అసహజ శృంగారం వల్లే ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. చాలా మంది ఓరల్ క్యాన్సర్ బాధితులను హైదరాబాద్‌లో కూడా చూశామని వారు చెప్పారు. అందుకే వారిని వ్యాధులపై తమతో చర్చించాలని కోరుతున్నామని తెలిపారు.

ఓరల్ సెక్స్ ద్వారా హెచ్‌పివి(హ్యూమన్ పుపిలోమా వైరస్) వ్యాప్తి చెంది క్యాన్సర్ వ్యాధికి కారణమని తెలిపారు. ఇండియాలో ఇలాంటి వ్యాధి కేసులు ఏడాదికి దాదాపు 30వేలు నమోదవుతున్నాయని చెప్పారు. అయితే చాలా మంది ఈ వ్యాధిపై మాట్లాడేందుకు సిగ్గుపడుతున్నారని తెలిపారు. కిమ్స్ ఆస్పత్రి అంకాలజిస్ట్ కె సంబశివయ్య మాట్లాడుతూ.. అసహజ శృంగారం వల్లే ఓరల్ క్యాన్సర్ వ్యాపిస్తోందని తెలిపారు.

Oncologists call for safe sex practices to prevent cancer

క్యాన్సర్ నియంత్రణలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అపోలో క్యాన్సర్ ఆస్పత్రులు, క్యూర్ ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో ‘క్యాన్సర్ కాన్‌క్లేవ్-2015' సదస్సు నిర్వహించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. అపోల్ క్యాన్సర్ ఆస్పత్రి క్యాన్సర్ సిఐ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ విజయానంద్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సదస్సు జరగనుందని తెలిపారు.

Oncologists call for safe sex practices to prevent cancer

పలు దేశాల నుంచి 3,100 మంది ప్రతినిధులతోపాటు 312 మంది ఫ్యాకల్టీ సభ్యులు హాజరవుతున్నట్లు తెలిపారు. అమెరికాలో ఓరల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు యువతేనని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+