One Plus నుంచి అదిరిపోయే ఫోల్డబుల్ ఫోన్
ఫోల్డబుల్ సెగ్మెంట్‌పై మొబైల్ కంపెనీలు ఎక్కువగా దృష్టి సారించాయి. గతంలో వచ్చిన ఫ్లిప్ ఫోన్ల కంటే మెరుగైన పనితీరుతో వినియోగదారుడిని ఆకట్టుకునేలా మంచి డిజైన్‌తో ఫోల్డబుల్ ఫోన్స్ (Foldable Phones)ను తీసుకొస్తున్నాయి. ఈ ఏడాది ఒప్పొ కంపెనీ నుంచి Find N2 Flip ఇప్పటికే మార్కెట్ లోకి విడుదలైంది. జులైలో శామ్‌సంగ్ (Samsung) నుంచి రెండు కొత్త ఫ్లిప్ ఫోన్స్ వస్తున్నాయి. ఇక వన్‌ప్లస్ (OnePlus) కంపెనీ తన ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్ట్‌లో మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. మొదటి ఫ్లిప్ ఫోన్ కాబట్టి ఈ ఫోన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
120Hz రిఫ్రెష్ రేట్ : OnePlus 11 5G ఇంప్రూవ్డ్ వెర్షన్‌గా ఉండొచ్చని మార్కెట్ లో అభిప్రాయపడుతున్నారు. 91మొబైల్స్ రిపోర్ట్ ప్రకారం.. OnePlus ఫోల్డ్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 8 అంగుళాల QHD+ OLED ప్రైమరీ డిస్‌ప్లే ఉండొచ్చని, ఎక్స్ టీరియర్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్-HD స్క్రీన్‌తో ఉంటుందని చెబుతున్నారు. ఈ డిస్‌ప్లేలు ప్రస్తుత OnePlus ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఉండే అధిక-నాణ్యత కలిగిన AMOLED ప్యానెల్‌తో అమర్చినట్లు తెలుస్తోంది.

4,800mAh బ్యాటరీ కెపాసిటీ : ఈ ఫోన్‌లో Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్ ఉపయోగించినట్లు చెబుతున్నారు. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,800 mah బ్యాటరీ, 16GB RAM+ 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుందని, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. 50 MP మెయిన్ కెమెరా, 48 MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 32 MP పెరిస్కోప్ కెమెరా, కవర్ డిస్‌ప్లే, ప్రైమరీ డిస్‌ప్లేపై 32MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చు. వన్‌ఫ్లస్ ఫోల్డ్ ఫోన్ లాంచ్ అయిన తరువాత శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 4, గూగుల్ ఫిక్సెల్ ఫోల్డ్, టెక్నో Phanton Fold వంటి ఫ్లిప్ ఫోన్ల నుంచి మార్కెట్‌లో తీవ్రతరమైన పోటీ నెలకొంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. .
శామ్‌సంగ్ ఫోన్లు జులైలో : ఫోల్డబల్ సెగ్మెంట్‌లో శామ్‌సంగ్ నుంచి రెండు ఫోన్లు జులై చివరి వారంలో మార్కెట్ లోకి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. గెలాక్సీ Z Flip 5, Z Fold 5 పేరుతో ఇవి రానున్నాయి. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో వీటిని విడుదల చేస్తారు. ఫోల్డబుల్ ఫోన్స్ కోసం అన్ ప్యాక్డ్ ఈవెంట్‌ను రెండు వారాలు ముందుకు జరపాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications