జగన్ విన్నింగ్ ఫార్ములా, ఢిల్లీ లెక్క క్లియర్ - ఆపరేషన్ అపోజీషన్..!!

ఏపీలో ఎన్నికల లెక్కలు మారుతున్నాయి. తెలంగాణ ఫలితాలు వెల్లడి తరువాత ఇక ఏపీలో రాజకీయం వేడెక్కనుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. తెలంగాణలో బీజేపీకి మిత్రపక్షంగా ఎన్నికల బరిలోకి దిగిన పవన్.. ఏపీలో తమ రెండు పార్టీలతో బీజేపీ కలిసి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నిర్ణయం ఏంటనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఢిల్లీ పరిణామాలపైన స్పష్టతతో ఉన్న జగన్ తన మార్క్ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.

ఏపీలో నయా సమీకరణాలు:తెలంగాణ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడి కానున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో ఎన్నికల రాజకీయం రాజుకోనుంది. ఏపీలో టీడీపీతో జత కట్టిన పవన్ కల్యాణ్..తెలంగాణలో బీజేపీ తో ముందుకు వెళ్తున్నారు. అక్కడ టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో, ఏపీ మూలాలు ఉండి తెలంగాణలో స్థిర పడిన ఓటర్లు బీజేపీ - జనసేనకు మద్దతిస్తారని కమలం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కానీ, అక్కడ టీడీపీ మద్దతు దారులు నేరుగా ప్రియాంక ర్యాలీల్లో పార్టీ జెండాలతో హాజరు కావటం...ఖమ్మం వంటి జిల్లాల్లో టీడీపీ నేతలు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించటంతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఇక, తెలంగాణలో పవన్ ఏ స్థాయిలో సహకరించారనేది కౌంటింగ్ తో స్పష్టం కానుంది.

Opinion: CM Jagan new Strategy to retain power in coming Elections, begins operation Opposition

ఢిల్లీ నేతల కొత్త లెక్కలు:ఏపీలో బీజేపీ మద్దతు పొందేందుకే తెలంగాణలో కాషాయం పార్టీకి వపన్ సహకరిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ,ఆ లెక్కే ఏపీలో ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ తో పొత్తు విషయంలో చంద్రబాబు, పవన్ సానుకూలంగా ఉన్న టీడీపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి దాదాపు 40-45 సీట్లు కేటాయించాల్సిన పరిస్థితులు ఉంటాయని..అది వైసీపీతో హోరా హోరీగా జరిగే పోరులో తమకు నష్టం చేస్తుందనేది టీడీపీ నేతల అంచనా. అదే సమయంలో అసలు బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. చంద్రబాబు అరెస్ట్ తరువాత బీజేపీ ఢిల్లీ నాయకత్వం గుంభనంగా వ్యవహరిస్తోంది. తెలంగాణలో టీడీపీ కేడర్ కాంగ్రెస్ కు సహకరిస్తున్న అంశం బీజేపీ పైన ప్రభావం చూపించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.

జగన్ టార్గెట్ అపోజీషన్:ఇక, ఇటు చంద్రబాబు కేసుల చక్రబంధంలో చిక్కుకున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలే సమయం ఉంది. పొత్తులు, సీట్లు..మేనిఫెస్టో, సర్దుబాట్లు..అన్ని వ్యవహారాలను చక్కదిద్దుకోవాల్సిన వేళ కేసులు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అటు జగన్ అభ్యర్దుల కసరత్తు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. బీజేపీ ఏపీలో వేసే అడుగులు పైన తమకు క్లియర్ సమాచారం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. సంక్షేమం చుట్టూ అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు తిరుగుతున్న వేళ..ఏపీలో ఇదే సంక్షేమ ఓట్ బ్యాంక్..అదే పాజిటివ్ ఓటింగ్ నమ్ముకున్న జగన్ ప్రతిపక్షాల పైన పై చేయి సాధించారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా వచ్చే మూడు నెలల కాలంలో సంక్షేమ క్యాలెండర్ ను ఇప్పటికే ప్రకటించారు. పూర్తి స్థాయిలో ఆపరేషన్ అపోజీషన్ ద్వారా ఆత్మరక్షణలోకి నెట్టేలా జగన్ వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ప్రజల్లో ఇప్పటికే వైసీపీ నేతలు ఉండగా.. టీడీపీ, జనసేన అసలు ఎన్నికల సంసిద్దత ప్రారంభించలేదు. దీంతో..జగన్ తాను నమ్ముకున్న విన్నింగ్ ఫార్ములాతో ముందుకు వెళ్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+