అఖిలకు ఊరట: టిడిపిలోకి 'రెడ్డి' నాయకులు!, దూసుకెళ్తున్న బ్రహ్మానంద రెడ్డి
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఊరట. ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు.
నంద్యాల/అమరావతి: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఊరట. ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. చేరిన వారిలో వివిధ పార్టీలకు చెందిన పలువురు గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

వీరు సహా 40 మంది
గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామానికి చెందిన ఇసుకపల్లి మహేశ్వర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, వర్దన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రాంరెడ్డి, వేమారెడ్డి, వెంకట రెడ్డిలతో పాటు మరో 40 మంది టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
Recommended Video


పార్టీ కండువా కప్పిన చంద్రబాబు
ఈ సందర్భంగా వీరికి చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శిరివెళ్ల మండలం టిడిపి కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కామినేనిపల్లి సర్పంచి రాంభూపాల్ రెడ్డి, సుధారామ ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు.

అందుకే టిడిపిలోకి
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి విజయానికి కృషి చేస్తామన్నారు. నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం చేస్తున్న కృషిని చూసే టిడిపిలోచేరుతున్నామన్నారు.

బ్రహ్మానంద రెడ్డి ఆశీర్వాద యాత్ర
కాగా, నంద్యాల ఉప ఎన్నిక టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఆశీర్వాదయాత్ర పేరుతో సైకిల్, పాదయాత్రగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తొలిసారి ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. కొన్నింటిని ఇప్పటికే పరిష్కరించారు. బుధవారం ఆయన నామినేషన్ వేయనున్నారు. భూమా బ్రహ్మానంద రెడ్డి భూమా శేఖర్ రెడ్డి తనయుడు.

ఇదీ భూమా బ్రహ్మానంద రెడ్డి
భూమా బ్రహ్మానంద రెడ్డి 1984, ఏప్రిల్ 4న రాయచోటిలో జన్మించారు. ప్రాథమిక విద్యను చెన్నైలో పూర్తి చేశారు. ఇంటర్, బీటెక్(2009) హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఇంటర్ చదువుతున్న రోజుల నుంచే జరుగుతున్న ఎన్నికల్లో చిన్నాన్న భూమా నాగిరెడ్డి, చిన్నమ్మ శోభానాగి రెడ్డిల తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారు. 2009, 2014 ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉమ్మడి కుటుంబంలోనే ఉంటూ 2013 భూమా నాగిరెడ్డి ఏర్పాటు చేసిన జగత్ పాల డెయిరీ ఎండీగా బ్రహ్మానంద రెడ్డి పని చేస్తున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications