ఏపీకి తుఫాను గండం - భారీ వర్షాలు, అప్రమత్తం..!!
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇది కాస్తా ఇవాళ అల్పపీడనంగా మారి రేపటికి వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు. ఉత్తరదిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. శనివారం రాత్రి నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

తుఫాను గండం: తుఫానుకు మోచాగా నామకరణం చేసారు. ప్రస్తుతానికి ఇది పశ్చిమ బెంగాల్, మయన్మార్‌ల వైపు పయనిస్తుందని అధికారులు పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఏపీ తీర ప్రాంతం పైన తుఫాను ప్రభావం ఉండే అవకాశం లేదని చెబుతున్నారు.
కోస్తా, రాయలసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలంటూ అప్రమత్తం చేసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.
మూడు రోజులు వర్షాలే: తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు వర్షంతో పాటు భారీ ఈదురు గాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది.
అప్రమత్తంగా ఉండాలి: వర్షాల కంటే ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రతో పాటుగా యానాం, కోస్తా జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలకు అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ముఖ్యంగా ఈ రోజు.. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అటు ఇప్పటికే జరిగిన పంట నష్టంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులకు కీలక సూచనలు చేసారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications