Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లవర్స్‌కు ఓయో బిగ్ షాక్..ఇక దబిడి దిబిడే..!

OYO అనేది ఒక బ్రాండ్ పేరు మాత్రమే. ఇది "On Your Own" అనే పదం నుండి స్ఫూర్తి పొందింది. ఓయో ప్రారంభంలో ఒరవేల్ స్టేస్ అనే పేరుతో ప్రారంభమైంది, తర్వాత ఓయోగా మార్చబడింది. ఈ బ్రాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బడ్జెట్ హోటళ్లు మరియు ఇతర అతిథి సేవలను అందిస్తుంది.ఓయోను 2013లో రితేష్ అగర్వాల్ స్థాపించారు. అప్పటి నుండి, ఇది భారతదేశం మరియు ఇతర దేశాలలో వేగంగా విస్తరించి, ప్రయాణికులకు వివిధ బడ్జెట్‌లకు అనుగుణంగా ఉండే అనేక రకాల సేవలను అందిస్తోంది.

అయితే మన దేశంలో ఓయో రూమ్స్‌ దుర్వినియోగం జరుగుతున్నాయని ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. గతంలో ప్రేమికులు పార్క్‌లను తమ అడ్డగా మార్చుకునేవారు. కానీ కాలక్రమేణ లవర్స్ ఏకాంతంగా గడపటానికి ఎక్కువగా ఓయో రూమ్స్‌ను తమకు బెస్ట్ ఛాయిస్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. ఓయో రూమ్స్ లవర్స్‌గా అడ్డగా మారిపోయిందనే చెప్పాలి. ఓయో రూమ్స్ పట్ల సమాజంలో ఏ రకమైన భావన ఉందో అందరికీ తెలిసిందే. నార్మల్ ఫ్యామిలీస్ ఓయో రూమ్‌ అంటేనే అసహ్యించుకునే రోజులు వచ్చాయి.

Oyo has changed the rules no entry for unmarried people

అసాంఘిక కార్యకలాపాలకు ఓయో రూమ్స్ అడ్డాగా మారాయి. ఈ హోటల్స్‌పై పోలీసులు స్పెషల్ నజర్ పెట్టాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. వ్యక్తిగత సమాచారంతో పాటు, ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాతే రూం ఇవ్వడం జరుగుతోంది. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ వేడుకల సమయంలో ఓయో రూమ్స్ బుకింగ్ కూడా రికార్డు స్థాయిలో జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. యూత్ ఎక్కువగా ఓయో రూమ్స్ బుకింగ్ చేసుకున్నట్టు తెలుస్తోంది.న్యూ ఇయర్ వేడుకల్లో ఓయో రూమ్స్‌‌కు ప్రేమికులు క్యూ కట్టారు.

10 లక్షల మందికి పైగానే ఓయో రూమ్స్ బుక్ చేసుకున్నట్టు యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో పెద్ద ఎత్తున ఓయో రూమ్స్‌‌పై విమర్శలు వినిపించాయి. అయితే తాజాగా ఓయో సంస్థ తాజాగా తమ రూల్స్‌ను మార్చింది. ఇక మీదట పెళ్లి అయిన వారికి మాత్రమే ఓయో రూమ్స్‌ ఇవ్వాలనే నిబంధనను తీసుకువచ్చింది. కేవలం వివాహం అయిన వారికి మాత్రమే ఇక మీదట రూమ్స్ ఇవ్వాలని నిర్ణయించింది.

ఓయో కొత్త రూల్ ప్రకారం ఓయో రూమ్స్‌ వచ్చే వారి రిలేషన్ గురించి మొదట ప్రశ్నిస్తారు. తర్వాత వారి రిలేషన్‌కి సంబంధించిన ఫ్రూఫ్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసిన తర్వాతే వారికి రూమ్‌ను కేటాయించడం జరుగుతోంది. ఓయో సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం లవర్స్‌కు పెద్ద దెబ్బ అని చెప్పాలి. తాజా రూల్స్​ ప్రకారం.. అవివాహిత జంటలు ఇకపై రూమ్స్​లో చెక్​ ఇన్​ చేయలేరు. అయితే, ఇది ప్రస్తుతం యూపీలోని మీరట్​లో మాత్రమే అమల్లో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని నగరాల్లో ఈ రూల్​ తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+