Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ రైతులకు సర్కార్ శుభవార్త..! ఇక అదే రోజు అకౌంట్లో జమ..!

ఏపీలో రైతులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం అమ్మకాల తర్వాత రైతులు డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇవాళ మరో కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరాలు వెల్లడించారు. 2025-2026 ఖరీఫ్ మాసంలో ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపుల్లో 94 శాతం నగదు 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు తెలిపారు.

ఇకపై ఉదయం ధాన్యం కొనుగోలు జరిగితే అదే రోజు సాయంత్రం రైతు ఖాతాలో నగదు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం అత్యంత విజయవంతంగా నిర్వహిస్తోందని, ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరుకున్నామని తెలిపారు. తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు తదితర జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు.

Paddy Cash Promise AP Assures Farmers of Same-Day Payment to Accounts

ఇప్పటివరకు ఎదురైన లోపాలను సమీక్షించి, రాబోయే రబీ సీజన్‌కు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. త్వరలో తిరుపతిలో రబీ సీజన్ కు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆర్ఎస్కేలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే విధంగా శిక్షణ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు కనీస మద్దతు ధర అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

Paddy Cash Promise AP Assures Farmers of Same-Day Payment to Accounts

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,83,623 మంది రైతుల నుంచి 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన మొత్తం లెక్కిస్తే రూ. 9,890 కోట్లుగా తేలిందని, ఇందులో 24 గంటల్లో రూ.9800 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామన్నారు.
రైతులు ఇబ్బందులు పడకుండా తొలిసారిగా ప్రత్యేక రైలు సదుపాయం కల్పించి, కృష్ణా మరియు గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలింపు చేపట్టామని తెలిపారు.క్షేత్రస్థాయిలో పర్యటనల సమయంలో రైతులకు అవసరమైన గన్ని బ్యాగులు, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ సదుపాయాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు అంచనాలతో సిద్ధంగా ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+