నేను వెళ్లను, గిడ్డి ఈశ్వరికి ఆదిలోనే గట్టి షాక్: చర్చలు ఫలించాయా?
Recommended Video

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఆమెతో పాటు పెద్ద ఎత్తున నియోజకవర్గానికి చెందిన, జిల్లాకు చెందిన నేతలు టీడీపీలో చేరుతున్నారు.

గిడ్డి ఈశ్వరితో పాటు పెద్ద ఎత్తున నేతలు
ఇందుకోసం ఆదివారం రాత్రి నుంచే నేతలు రాజధాని అమరావతికి చేరుకున్నారు. పలువురు వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు ఈశ్వరితో పాటు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గిడ్డి ఈశ్వరితో పాటు వారిని కూడా చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

ఈశ్వరికి ఆదిలోనే షాక్
అయితే, గిడ్డి ఈశ్వరికి ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. ఆమెతో పాటు టీడీపీలో చేరుతారని భావించిన చింతపల్లి జెడ్పీటీసీ పద్మకుమారి అధికార పార్టీలోకి రావడానికి ఆసక్తి కనబర్చడం లేదు. దీనిపై ఆమె సోమవారం స్పందించారు.

చర్చలు ఫలించాయా?
తాను ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో పాటు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం లేదని పద్మకుమారి వెళ్లడించారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాగా, వైసీపీ నేతల చర్చలు ఫలించడంతో ఆమె వెనక్కి తగ్గి ఉంటారని భావిస్తున్నారు. ఈశ్వరితో పాటు టీడీపీలో చేరేందుకు పదుల సంఖ్యలో వాహనాల్లో అభిమానులు, అనుచరులు వచ్చారు.

గిడ్డి ఈశ్వరి తర్వాత మరో ఇద్దరు నుంచి నలుగురు
ఇదిలా ఉండగా గిడ్డి ఈశ్వరి అనంతరం మరో ఇద్దరు నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. వారు కూడా ఈ వారంలోనే చేరే అవకాశముంది. అయితే వారు ఎవరనేది తేలాల్సి ఉంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications