వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆ సీక్రెట్ మీకెలా తెలిసింది, హ్యాక్ చేశారా, నవ్వులపాలైన కేటీఆర్'

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలంగాణ వెబ్ పోర్టల్, ఏపీ వెబ్ పోర్టల్ రెండూ వేర్వేరని, సర్వర్‌ను కాపీ చేయడం ఎలా సాధ్యమని ఏపీ ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ బుధవారం నాడు అన్నారు. తెలంగాణ పరిశ్రమల శాఖ వెబ్ సైట్‌ను కాపీ చేశారంటూ తెలంగాణ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

అప్లికేషన్ కాపీ చేసిన బాబు ప్రభుత్వం: పోలీసులకు టి ఫిర్యాదుఅప్లికేషన్ కాపీ చేసిన బాబు ప్రభుత్వం: పోలీసులకు టి ఫిర్యాదు

దీనిపై పరకాల ప్రభాకర్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తమ పోర్టల్‌లో ఇప్పటి వరకు తొమ్మిది వేల లావాదేవీలు జరిపామమన్నారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం మరో రాష్ట్రంపై ఫిర్యాదు చేయలేదని, చవకబారు ఆరోపణలపై దృష్టి సారించబోమన్నారు.

కనీస సమాచారం లేకుండా మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభియోగాల్లో ఎలాంటి వాస్తవాలు లేవని తాము నిరూపించామన్నారు. దీనిపై తెలంగాణ మంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు.

Parakala counter to KTR for complains to Centre about AP's 'unethical e-theft'

ఏపీ అప్ లోడ్ చేసిన సమాచారం తెలంగాణకు ఎలా తెలిసిందని, వెబ్ పోర్టల్‌లో సమాచారం రహస్యంగా ఉంటుందని, మా వెబ్ పోర్టల్‌ను మీరు హ్యాక్ చేశారా అని ప్రశ్నించారు. గత ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి రెండో స్థానం లభించిందని, ఈ ఏడాది తొలిస్థానం వచ్చే అవకాశం ఉండటంతో ఏపీపై తెలంగాణ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

ఏపీ 'కాపీ'కిదే సాక్ష్యం, తప్పును కూడా వదల్లేదు: కెటిఆర్(ఫొటోలు)ఏపీ 'కాపీ'కిదే సాక్ష్యం, తప్పును కూడా వదల్లేదు: కెటిఆర్(ఫొటోలు)

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 13వ స్థానంలో ఉన్న తెలంగాణను రెండో స్థానంలో ఉన్న ఏపీ ఎందుకు కాపీ కొడుతుందని ఎద్దేవా చేశారు. వెబ్ సైట్‌ను గమనించకుండా కేసులు పెట్టి, లేఖలు రాసి తెంగాణ మంత్రి కేటీఆర్ నవ్వులపాలయ్యారన్నారు.

తెలంగాణ వెబ్ పోర్టల్, ఏపీ వెబ్ పోర్టల్ రెండూ వేర్వేరని, సర్వర్‌ను కాపీ చేయడం ఎలా సాధ్యమని ఏపీ ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ బుధవారం నాడు అన్నారు. తెలంగాణ పరిశ్రమల శాఖ వెబ్ సైట్‌ను కాపీ చేశారంటూ తెలంగాణ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

English summary
Parakala counter to KTR for complains to Centre about AP's 'unethical e-theft'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X