లోకేష్ సీఎం ఖాయం: పత్తిపాటి, జగన్ వినకపోవడం వల్లే ఈ పరిస్థితి: వైసీపీ మాజీ నేత

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: దుర్గ గుడిలో తాంత్రిక పూజలు చేయాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదివారం అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత అతి చిన్న వయస్సులో లోకేష్ ముఖ్యమంత్రి కావడం నిజం అవుతుందని చెప్పారు.

అజ్ఞాతవాసిపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం, అర్ధరాత్రి నుంచి మొదలు

ఎన్ని హామీలు ఇచ్చినా వైసీపీ అధినేత వైయస్ జగన్ చెప్పిన మాటలను నమ్మే పరిస్థితులో ప్రజలు లేరని ఆయన అంతకుముందు అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలని చంద్రబాబు చూస్తుంటే, జగన్ దానిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.

జగన్ ప్రతిపక్ష పాత్రను సరిగా నిర్వర్తించడం లేదు

జగన్ ప్రతిపక్ష పాత్రను సరిగా నిర్వర్తించడం లేదు

జగన్ ప్రతిపక్ష నాయకుడు పాత్రను కూడా సరిగా నిర్వహించడం లేదని పత్తిపాటి పుల్లారావు అన్నారు. కనకదుర్గ గుడిలో పూజలకు సంబంధఇంచి కొందరు తెలుగుదేశం పార్టీపై బురదజల్లేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. పూజలకు సంబంధించి విచారణ కమిటీని నియమించారని, త్వరలో నిజాలు తెలుస్తాయన్నారు.

 జగన్‌కు టిక్కెట్ ఇవ్వకుండా

జగన్‌కు టిక్కెట్ ఇవ్వకుండా

వైయస్ జగన్ తనకు టిక్కెట్ ఇవ్వకుండా పక్కన పెట్టాలని భావించారని మరో టిడిపి నేత గుర్నాథ్ రెడ్డి అన్నారు. ఆయన గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. ఆ తర్వాత ఇటీవల తెలుగుదేశం పార్టీలో చెప్పారు.

 జగన్ నమ్మకద్రోహం చేశారు

జగన్ నమ్మకద్రోహం చేశారు

జగన్ తనను పక్కన పెట్టాలనుకున్న మాట వాస్తవమేనని, కానీ అసలు జగన్ ఎందుకు అలా ఆలోచించారో అర్థం కావడం లేదని గుర్నాథ్ రెడ్డి అన్నారు. తాను ఎప్పుడూ ఎవరికీ నమ్మక ద్రోహం చేయలేదని ఆయన వాపోయారు. జగనే నాకు నమ్మకద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

 జగన్ వినకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి

జగన్ వినకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి

వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌తో నడిచిన పాపానికి తనకు ఇలా చేశారని గుర్నాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను మొహాన్నే నిష్టూరంగా చెప్పడం తనకు అలవాటు అని, కానీ ఇవన్నీ జగన్‌కు నచ్చవని చెప్పారు. ఎవరు చెప్పినా జగన్ వినరని ఆరోపించారు. అలా వినకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Pattipati Pullarao and Telugu Desam Party leader Gurnath Reddy fired at YSR Congress Party chief YS Jagan Mohan Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి