ఘనంగా రాధా వివాహం - పవన్, కొడాలి సహా నేతల సందడి..!!
వంగవీటి రంగా తనయుడు, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ వివాహం ఘనంగా జరిగింది. జక్కం పుష్పవల్లితో వంగవీటి రాధా వివాహ వేడుకకు ప్రముఖులు తరలి వచ్చారు. పార్టీలకు అతీతంగా నేతలంతా హాజరై వధూవధులను ఆశీర్వదించారు. ఈ వివాహా వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్ట్ గా మారారు పవన్ కళ్యాణ్. కాసేపు రాధాతో కాసేపు మాట్లాడి.. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ, టీడీపీ నేతలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఘనంగా వివాహ వేడుక:వంగవీటి రాధా వివాహ వేడుకలు ఆదివారం రాత్రి విజయవాడ, పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో జరిగాయి. అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. వివాహానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. రాధాకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వధువు పుష్పవల్లి తండ్రి నర్సాపురంలో జనసేన నేతగా ఉన్నారు. పవన్ కల్యాణ్ తన వారాహి యాత్ర వేళ వారి ఇంట్లోనే బస చేసారు. వంగవీటి రాధా వివాహ ఖరారు విషయంలోనూ టీడీపీ, జనసేన స్థానిక నేతలు మధ్యవర్తిత్వం వ్యవహరించారు.

పవన్ తో సహా ప్రముఖుల హాజరు:ఇక, రాధా వివాహంలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకొని..అక్కడి నుంచి నేరుగా వివాహ వేదిక వద్దకు పార్టీ నేతలతో కలిసి వచ్చారు. ఇక, వంగవీటి రాధా మిత్రులు మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీతో సహా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు వివాహానికి హాజరయ్యారు.

బీఆర్ఎస్ నేత తోట చంద్రశేఖర్, గద్దే రామ్మోహన్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, కామినేని శ్రీనివాస్, ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో పాటుగా పలువురు నేతలు..పారిశ్రామిక వేత్తలు వంగవీటికి శుభాకాంక్షలు తెలిపారు. పరిటాల సునీత, శ్రీరాం సైతం వంగవీటి రాధాను కలిసి వివాహ శుభాకాంక్షలు చెప్పారు. పెద్ద సంఖ్యలో అభిమానులు వివాహ వేడుకల్లో పాల్గొని వధూవధులకు శుభాకాంక్షలు తెలిపారు.

సందడిగా కల్యాణ్ వేడుక:రాధా, పుష్పవల్లి నిశ్చితార్థం ఆగస్టులో జరిగింది. వచ్చే ఎన్నికల్లో వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి సిద్దం అవుతున్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో జనసేన లో చేరేందుకు రాధా నిర్ణయించుకున్నారనే వాదన ఉంది. ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తు ఖాయం కావటంతో..రాధా నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది. ఇప్పుడు ఓ ఇంటి వాడయిన వంగవీటి రాధా వచ్చే ఎన్నికల్లో పోటీ పైన త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ ప్రముఖులు వివాహ వేదిక వద్ద రాధాతో కాసేపు మాట్లాడి.. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాధా వివాహ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications