మంత్రిగా పవన్ కళ్యాణ్.. ఉబ్బితబ్బిబ్బైన అన్నాలెజ్నేవా.. రేణూ దేశాయ్ ఎమోషనల్

పవన్ కళ్యాణ్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు చాలా ఆసక్తిగా తిలకించారు.

పవన్ ప్రమాణం.. సంతోషంలో మెగా ఫ్యామిలీ
మెగా ఫ్యామిలీ మొత్తం గన్నవరంలోని కేసరపల్లి వద్ద నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారాన్ని ఆద్యంతం తిలకించారు. పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవర్ స్టార్ ప్రమాణస్వీకారం చేస్తుంటే ఉబ్బి తబ్బిబ్బయ్యారు. మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, చిరంజీవి సతీమణి సురేఖ, నాగబాబు ఆయన సతీమణి, రామ్ చరణ్ లతో పాటు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నేవా కూడా హాజరయ్యారు.

Pawan Kalyan as a minister Anna lezhneva overwhelmed Renu Desai is emotional viral news
పవన్ ప్రమాణం చేస్తుంటే ఉబ్బితబ్బిబ్బయిన అన్నా లెజ్నేవా
పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ పిల్లలు అకిరా నందన్, ఆద్య కూడా ఈ ప్రమాణ స్వీకార వేడుకకు వచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆయన భార్య అన్నా లెజ్నేవా ముఖంలో సంతోషం తొణికిసలాడింది. పవన్ కళ్యాణ్ కష్టం ఫలించింది అన్న ఆనందంలో ఆమె ఉబ్బి తబ్బిబ్బయింది.

సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన రేణూ దేశాయ్
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లిన అకీరా నందన్ పంచకట్టుతో అందరిని ఆకట్టుకోగా, ఆధ్య కూడా చాలా ట్రెడిషనల్ గా డ్రెస్ చేసుకొని ముద్దుగా రెడీ అయి వెళ్లారు.

పవన్ ప్రమాణస్వీకారానికి వెళ్ళిన రేణూ దేశాయ్ కొడుకు, కూతురు
ప్రమాణ స్వీకారానికి ముందు వాళ్ళు రేణు దేశాయ్ వీడియో కాల్ చేసి తాము ఎలా రెడీ అయ్యామో చూపించి మురిసిపోయారు కూడా ..దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది రేణూ దేశాయ్. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

పవన్ కు ఆ పని చెయ్యాలని చెప్పిన రేణూ దేశాయ్
ఇక రేణు దేశాయ్ పెట్టిన పోస్టులో నా పిల్లలు వాళ్ళ నాన్న బిగ్గెస్ట్ డే రోజు ఇలా రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏపీ స్టేట్ కి, ప్రజలకు మంచి చేయాలని ఆశిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ కు కంగ్రాచ్యులేషన్స్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+