Ambati Rambabu Song: అంబటి పాట వెనుక పవన్ ? వైసీపీ నేత షాకింగ్..!
ఏపీలో గత కొన్నేళ్లుగా ప్రతీ ఏడాది సంక్రాంతి సందర్భంగా ఓ పాట రూపొందించడం, దానికి తానే స్వయంగా డ్యాన్స్ చేయడం వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుకు అలవాటుగా మారింది. వైసీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ను కీర్తిస్తూ ఇలా పాటలు చేయడం ప్రారంభించిన అంబటి.. కూటమి ప్రభుత్వం వచ్చాక రూటు మార్చారు. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన రూపొందించిన తాజా పాట ఇవాళ రిలీజ్ చేశారు. అంతే కాదు దీని వెనుక ఉన్న ఓ కీలక కారణాన్ని కూడా బయటపెట్టారు.
ప్రభుత్వానికి కౌంటర్ గానే ఈ సంక్రాంతి పాట రూపొందించారని వచ్చిన విమర్శలపై అంబటి స్పందించారు. ఇది కౌంటర్ కాదు
, ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ఐదు నిమిషాల పాటలో ఇమిడ్చే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యామని తెలిపారు. రెండు నెలలుగా ప్రిపేర్ చేసి ఇవాళ ప్రెజెంట్ చేశామని తెలిపారు. ఇందులో హద్దులు మీరిన విమర్శలు లేవన్నారు.
పచ్చినిజాలే ఉన్నాయి, వాటిని ప్రజలు ఇవాళ కాకపోతే రేపు గ్రహిస్తారని, కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తారని తెలిపారు.
తాను సత్తెనపల్లి నుంచి తాను గుంటూరుకు వచ్చేయడం వల్ల ఇక్కడే ఈ పాట చేశామన్నారు.

Ambati Rambabu Anna Dance🔥
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) January 14, 2026
వింటున్నావా చంద్రబాబు.
అంబటి భోగి పాట.
స్టెప్ లతో ఇరగదీసిన అంబటి. pic.twitter.com/Y9yYGfh9kv
అలాగే సంక్రాంతి అనగానే తాను గుర్తుకురావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అన్నారు. తాను సంక్రాంతికి డ్యాన్స్ వేస్తే సంబరాల రాంబాబు అని పవన్ అన్నారని, దాంతో పాటు బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టి గేలి చేశాడన్నారు. మొన్న సంక్రాంతి డ్యాన్స్ ఆయనే చేశాడని గుర్తుచేశారు. అయితే ఆ స్టెప్పులు మాత్రం తనవి కాదన్నారు. ఆయన సినిమా నటుడిగా ఉండి తన స్టెప్పుల్ని అంత పాపులర్ చేయడం వల్లే తనకు ఇంత పేరు వచ్చిందన్నారు. తనను సంబరాల రాంబాబు అని పవన్ అంటే అవును.. నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంబరాల రాంబాబునే అన్నానని, కానీ ఆయన మాత్రం చెప్పుకోలేడన్నారు. ఆయన రాజకీయ నాయకుడు కాదని యాక్టర్ మాత్రమేనన్నారు. ఆయన ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేరన్నారు. అది ఆయన స్వభావం అన్నారు.












Click it and Unblock the Notifications