బర్త్ డే వేళ.. వివాదంలో పవన్- కాపుల కోటలో..ఎవరితో పెట్టుకోకూడదో..!!

Happy Birthday Pawan Kalyan: నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బర్త్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పుట్టినరోజు వేడుకలను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా జరుపుకొంటోన్నారు. పలు చోట్ల కేక్ లు కట్ చేస్తోన్నారు. స్వీట్లను పంచిపెడుతున్నారు. అలాగే కొన్ని సేవా కార్యక్రమాలను సైతం చేపట్టారు. రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోన్నారు.

పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు విషెస్ తెలియజేస్తోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, శ్రుతి హాసన్.. సహా పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలుపుతూ ట్వీట్లు పెడుతున్నారు. టాలీవుడ్ కు చెందిన దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు పవన్ గ్రీటింగ్స్ పంపించారు.

Pawan Kalyan Birthday banner controversy Konaseema

ఇదిలావుండగా- పవన్ కల్యాణ్ అభిమానులు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ తీవ్ర వివాదానికి దారి తీసింది. దాని మీద రాసిన కొటేషన్స్ అభ్యంతరకరంగా ఉండటం దీనికి కారణం. కోనసీమ జిల్లాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కోనసీమ సహా కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ కు చెందిన కాపు సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉండటం, ఆయా జిల్లాలన్నీ కూడా జనసేనకు కంచుకోటలుగా ఉండటం గమనార్హం.

మీరెంత.. మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం.. కొడకల్లారా.. అని ఆ బ్యానర్ పైభాగంలో రాసివుండటం కనిపించింది. దానికి ఒక వైపు పవన్ కల్యాణ్ భారీ ఫొటో, మరో వైపు త్వరలో విడుదల కాబోతోన్న OG సినిమా టైటిల్ ను ముద్రించారు. ఈ కొటేషన్ పట్ల దళిత సంఘాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యానర్ ను తొలగించాలంటూ పట్టుబట్టారు.

ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా, అవమానించేలా ఈ బ్యానర్ ను ఏర్పాటు చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ పట్టుబ్టటారు. నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారికి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. దళిత సంఘాల నాయకులు వినిపించుకోలేదు. ఆ బ్యానర్ మొత్తాన్నికూడా చించేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+