పవన్ కళ్యాణ్ బర్త్ డే: వరినారుతో స్పెషల్ విషెస్, మెగా రక్తదానం; విదేశాల్లోనూ రచ్చ!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, నాయకులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గుంటూరు జిల్లా రైతులు వెరైటీగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ అభిమాన నేతకు పచ్చనైన వరి నారు తో శుభాకాంక్షలు తెలియజేశారు.

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామ రైతులు వరి నారు తో జనసేన పార్టీ గుర్తును ఏర్పాటు చేసి పవన్ కోసం అత్తోట కౌలు రైతులు అని వరినారుతో పంట పొలంలో క్యాప్షన్ పెట్టి మరి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Pawan Kalyan Birthday special wishes from tenant farmers, celebrations in abroad too!!

కౌలు రైతుల కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న సహాయానికి కృతజ్ఞతగా కౌలు రైతులు ఏర్పాటుచేసిన ఈ స్పెషల్ బర్త్డే విషెస్ అందరిని ఆలోచించేలా చేస్తుంది. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కౌలు రైతులకు ఆర్ధిక సాయం చేస్తూ వారి కోసం పాటు పడుతున్న క్రమంలోనే వారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

మరోవైపు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ శిబిరాన్ని ప్రారంభించి రక్త దానం చేశారు. పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.

అంతేకాదు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు అల్పాహార విందును ఏర్పాటు చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా జనసేనాని ఎప్పటికీ ఉంటారని వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజును న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద జనసేన నేతలు ఘనంగా నిర్వహించారు. కళ్యాణ్ కు కేక్ కట్ చేసే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ యూఎస్ఏ ఆధ్వర్యంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. దేశ విదేశాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆయన పుట్టినరోజు సందర్భంగా పండుగ జరుపుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+