జనసేన పెట్టాకే పవన్ కళ్యాణ్ ఆస్తులు బాగా కొన్నారు.. ఆయన అపరమేధావి
విజయవాడ పశ్చిమ నుంచి తనకు టికెట్ తగ్గకపోవడంతో జనసేన పార్టీకి వైసీపీలో చేరిన పోతిన వెంకట మహేష్ పవన్ కళ్యాణ్ ను పదేపదే టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని, ఆయన అఫిడవిట్ నిండా పచ్చి అబద్ధాలు, మోసాల చిట్టా ఉందని పోతన మహేష్ ఆరోపించారు.
చంద్రబాబు ప్యాకేజీలతో పవన్ ఆస్తులు కొన్నారు
పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాతనే ఎక్కువ ఆస్తులు కొనుగోలు చేశారని, ఆయనకు సినిమా రంగం కంటే రాజకీయ రంగమే బాగా కలిసి వచ్చినట్టు అర్థమవుతుందని పోతిన వెంకట మహేష్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ప్యాకేజీలు ఇచ్చారని, ఆ ప్యాకేజీ తోనే ఆస్తులను కొనుగోలు చేసిన స్పష్టమవుతుందని మహేష్ ఆరోపించారు.

లాజికల్ ప్రశ్న వేసిన పోతిన మహేష్
పవన్ తన అఫిడవిట్లో తన ఆస్తుల విలువను 90కోట్లుగా చూపించారని, మార్కెట్ రేటు ప్రకారం ఆయన ఆస్తులు విలువ 400కోట్ల నుంచి 450కోట్ల రూపాయలు ఉంటుందని పోతిన మహేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఆదాయం 114కోట్లు, కట్టిన పన్ను 67కోట్లు కాగా, ఆయన ఇచ్చిన విరాళాలు 20కోట్లు పోతే మిగిలిన 20కోట్లతో 90కోట్ల విలువైన ఆస్తులు ఎలా కొన్నారో చెప్పాలని పోతిన మహేష్ లాజికల్ గా ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ఆర్ధిక మోసాలకు పాల్పడ్డారు
సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్ లను కూడా అప్పులుగా చూపించిన అపర మేధావి పవన్ కళ్యాణ్ అంటూ పోతిన మహేష్ తిట్టిపోశారు. పవన్ కళ్యాణ్ ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీ చేయాలని, తేడా వస్తే శిక్ష కూడా వేయాలని వచ్చిన మహేష్ డిమాండ్ చేశారు.

కాపులను మోసం చేసిన పవన్ కళ్యాణ్
ఇక పవన్ కళ్యాణ్ అఫిడవిట్ లో పేర్కొన్న టెన్త్ క్లాస్ విద్యార్హత విషయం కూడా వివాదాస్పదమేనని పోతిన మహేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కాపులను మోసం చేశారని, చంద్రబాబు భజన చేయడం తప్ప పవన్ కళ్యాణ్ చేసింది ఏమీ లేదని పోతిన మహేష్ అసహనం వ్యక్తం చేశారు
ఆయన జీవితంలో ఏదీ పర్మినెంట్ కాదు.. అన్నీ టెంపరరీనే
పవన్ కళ్యాణ్ కాపుల ఆత్మగౌరవం దెబ్బతీశారని, ఆయన జీవితంలో ఏదీ పర్మినెంట్ గా ఉండదని అన్ని తాత్కాలిక వ్యవహారాలేనన్నారు. కాపులను పసుపు సైన్యంగా మార్చే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని చంద్రబాబు మీద అంత విశ్వాసం చూపించడానికి పవన్ కళ్యాణ్ ఎంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications