Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్! సవాల్ చేశావుగా, మోడీపై దమ్ముందా, నీకు నేనున్నా, అవిశ్వాసం పెట్టు: పవన్ కళ్యాణ్

హైదరాబాద్: పార్లమెంటులో తాము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమని, కానీ అందుకు కావాల్సిన మద్దతును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకు వస్తారా అన్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రతి సవాల్‌ను జనసేనాని పవన్ కళ్యాణ్ స్వీకరించారు.

Recommended Video

    YSRCP MLA Roja questions Pawan over JFC

    జగన్ అవిశ్వాస తీర్మానం పెడితే, తాను ఎంపీల మద్దతు తీసుకు వస్తానని జనసేనాని చెప్పారు. అసలు ఒక్కరైనా అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చునని చెప్పారు. జగన్ అవిశ్వాసం పెడితే మీకు నేను అండగా ఉంటానని, సీపీఎం, సీపీఐలను తీసుకు వస్తానని, కావాలంటే కర్నాటక వెళ్తానని చెప్పారు.

     క్రెడిట్ మీరే తీసుకోండి

    క్రెడిట్ మీరే తీసుకోండి

    జగన్ అవిశ్వాస తీర్మానం పెడితే తాను ఎంపీల మద్దతు సంపాదిస్తానని, అందుకు సిద్ధమేనని పవన్ చెప్పారు. మీరు అవిశ్వాసం పెడితే 50 మంది నుంచి 80 మంది వరకు మీకు మద్దతిస్తారని చెప్పారు. కావాలంటే తాను ఢిల్లీ వరకు వెళ్తానని చెప్పారు. అవిశ్వాసం పెట్టి ఆ క్రెడిట్ మీరే తీసుకోండని జగన్‌కు చెప్పారు.

     జగన్! సవాల్ చేశావుగా, వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు

    జగన్! సవాల్ చేశావుగా, వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు

    ఏపీకి ప్రయోజనాల విషయంలో తనవంతు ఏ సాయమైనా చేసేందుకు తాను సిద్ధమని పవన్ కళ్యాణ్ చెప్పారు. అవిశ్వాసం విషయంలో వైసీపీ వెనక్కి వెళ్తే కనుక అప్పుడు తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందన్నారు. జగన్ సవాల్ చేశారు కాబట్టి నేను వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.

    టీడీపీ వైఖరి కూడా తెలుస్తుంది

    టీడీపీ వైఖరి కూడా తెలుస్తుంది

    మీ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు టీడీపీలోకి వెళ్లారని, మిగతా ఐదుగురితో అవిశ్వాస తీర్మానం పెట్టించాలని పవన్ వైసీపీని సవాల్ చేశారు. వామపక్ష ఎంపీలతో పాటు కన్నడ, తమిళ ఎంపీల మద్దతు తాను కోరుతానని చెప్పారు. వైసీపీ అవిశ్వాసం పెడితే టీడీపీ వైఖరి కూడా తెలుస్తుందన్నారు.

    వీరి మద్దతు కోరుదాం

    వీరి మద్దతు కోరుదాం

    రాహుల్, అఖిలేష్, ముస్లీం, తెరాస మద్దతు కూడా కోరుదామని పవన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి మీరు భయపడుతున్నట్లుగా కనిపిస్తోందని చంద్రబాబు నాయుడును ఉద్దేశించి పవన్ అన్నారు. ప్లకార్డులు, విచిత్ర వేషధారణ నిరసనలతో ప్రయోజనం ఉండదని చెప్పారు. టీడీపీ వాళ్లు తన మిత్రులు అంటున్నారని, అది కూడా తెలుస్తుందని చెప్పారు.

     అవిశ్వాసం ఎవరు పెడతారా అని ఎదురు చూస్తున్నా

    అవిశ్వాసం ఎవరు పెడతారా అని ఎదురు చూస్తున్నా

    ఇది మన అందరి పోరాటం అన్నారు. ఎవరు అవిశ్వాసం పెడతారా అని జనంతో పాటు తాను కూడా ఎదురు చూస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కేవలం అవిశ్వాసం గురించి మాట్లాడి, జగన్‌కు సవాల్ చేసి పవన్ మీడియా సమావేశం ముగించారు. కాగా, ఓ విధంగా పవన్ వైసీపీని ఇరకాటంలో పడేశారని చెప్పవచ్చు.

    దమ్ముంటే ఎదురు తిరుగు

    దమ్ముంటే ఎదురు తిరుగు

    మార్చి 5వ తేదీన వైసీపీ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంతో ముందుకు రావాలని పవన్ సవాల్ చేశారు. మార్చి 4న తాను ఢిల్లీకి వస్తానని చెప్పారు. దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలన్నారు. జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రానికి ఎదురు తిరగాలన్నారు. తద్వారా జగన్ సవాల్‌కు పవన్ ధీటుగా స్పందించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+