మెగా ఈవెంట్ కు పవన్ - అన్నయ్యతో కలిసి, 'గేమ్ ఛేంజర్'..!!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటుగా బెనిఫిట్ షో లు.. టికెట్ ధరల పెంపు పైన ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అయితే, డిప్యూటీ సీఎంగా బాధ్యత లు చేపట్టిన తరువాత రామ్ చరణ్ తొలి సినిమా విడుదల అవుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ను దిల్ రాజు ఆహ్వానించారు.
పవన్ తో చర్చలు
రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఈ సినిమా నిర్మాతగా ఉన్న దిల్ రాజు డిప్యూటీ సీఎం పవన్ తో భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ డేట్ ఇస్తే జనవరి 4 లేదా 5న ఏపీలో మెగా ఈవెంట్ నిర్వహిస్తామని దిల్ రాజు ఇప్పటికే ప్రకటించరాు. జనవరి 1న ట్రైలర్, 10న సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు. ఈ సారి నిర్వహించే ఈవెంట్ ఒక చరిత్ర సృష్టించేలా ఉంటుంది. గేమ్ ఛేంజర్ విడుదల అయ్యాక... ఓజీ పబ్లిసీటికి షిప్ట్ అవుదామంటూ దిల్ రాజు జోష్ పెంచారు.

దిల్ రాజు ఆహ్వానం
అయితే, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది. పవన్ హాజరయ్యేందుకు అంగీకరిస్తే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు సైతం ఈవెంట్ కు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇదే సినిమా గురించి చిరంజీవి తనతో చెప్పిన మాటలను దిల్ రాజు బయట పెట్టారు. హిట్ కొడుతు న్నామని అభిమానులకు చెప్పాలని చిరంజీవి తనకు చెప్పారని వెల్లడించారు. మెగా పవర్ స్టార్‌లో మెగాస్టార్‌ను చూస్తారని చెప్పారు. పవర్ స్టార్‌ను కూడా చూస్తారని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ నట విశ్వరూపం ఈ సినిమా లో తప్పకుండా చూస్తారంటూ దిల్‌రాజ్ మరింత ఆసక్తి పెంచారు

పవన్ సిద్దమేనా
ఇక, దిల్ రాజు ఆహ్వానం మేరకు అన్నయ్య తో కలిసి పవన్ గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు హాజరు అవుతారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. మెగా బ్రదర్స్ హాజరయ్యే ఈవెంట్ కావటంతో ఏపీ నడిబొడ్డున భారీ ప్రదేశంలో కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నారు. ఇక, తెలంగాణలో బెనిఫిట్ షో, టికెట్ ధరల పెంపుకు అక్కడి ప్రభుత్వం నిరాకరించటంతో... ప్రస్తుతం దిల్ రాజు భేటీలో పవన్ తో ఏపీ ప్రభుత్వ సహకారం కోరే అవకాశం ఉంది. కాగా, పవన్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు .. బెనిఫిట్ షో , టికెట్ ధరల పెంపు పైన ఏ విధంగా స్పందిస్తారనేది సినీ, పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications