ఎమ్మెల్యేగా తీసుకునే జీతంపై పవన్ క్లారిటీ ! వెయ్యిరెట్లు ఇచ్చేస్తానన్న జనసేనాని..

ఏపీలో గతంలో పనిచేసిన పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని చెప్పేవారు. కానీ దానికి కొన్ని వేల రెట్లు అవినీతికి పాల్పడిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ తాను తీసుకోబోయే జీతంపై క్లారిటీ ఇచ్చేశారు. పిఠాపురం ఎమ్మెల్యేగా తాను తీసుకోబోయే జీతంపై పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యేగా రూపాయి కూడా తీసుకోనని చెప్పనని, పూర్తి జీతం తీసుకుంటానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తర్వాత తాను ఇవ్వాల్సింది మాత్రం ఇచ్చేస్తానన్నారు. కానీ జీతం మాత్రం ఎందుకు తీసుకుంటానంటే ... ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము తింటున్నాను కాబట్టి ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికే అని పవన్ తెలిపారు. తాను తీసుకునే ప్రతీ రూపాయికి ప్రజలు తనను చొక్కా పట్టుకుని నిలదీయాలని జనసేనాని తెలిపారు.

pawan kalyan confirms to take full salary as mla- here is interesting reason

మేం కట్టిన పన్నులతో నీకు జీతమిస్తున్నారు, నువ్వు ఎందుకు పనిచేయడం లేదని ప్రజలు తాను పనిచేయకపోతే నిలదీయాలని పవన్ సూచించారు. ప్రజలకు ఆ హక్కు ఉండాలనేందుకే తాను జీతం తీసుకుంటున్నట్లు పవన్ తెలిపారు. గతంలో తాను ఎమ్మెల్యే అయితే జీతం తీసుకుంటా లేదా అని తనలో తాను అనుకునే వాడినని, రూపాయి జీతం తీసుకున్నానని చెప్పుకోకుండా పూర్తి జీతం తీసుకుంటానన్నారు. ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు తనకు బాధ్యత గుర్తుకు రావాలన్నారు.

జనసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎలా ఉంటుందో, చట్టాలు చేసే ప్రజాప్రతినిధులు ఎలా ఉంటారో చూపిద్దామని పవన్ పిలుపునిచ్చారు. బలమైన వ్యవస్థను నడిపేవారు ఎలా ఉంటారు, భవిష్యత్తులో రాజకీయ నేతలు కావాలంటే ఎలా ఉండాలో చూపిద్దామని వారికి సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+