Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోటీ చేసే స్థానం ప్రకటించిన పవన్ కల్యాణ్, ఎంపీగానూ క్లారిటీ - ఆట మొదలు..!!

జనసేనాని పవన్ తాను పోటీ స్థానం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా స్వయంగా పవన్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. పిఠాపురం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసారు. ఎంపీగా పోటీ చేయటం పైన కూటమి పెద్దలతో మాట్లాడి నిర్ణయం చెబుతానని పేర్కొన్నారు. పోటీకి కారణాలను వివరించారు.

పిఠాపురం నుంచి పోటీ
పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం పైన స్పష్టత ఇచ్చారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కల్యాణ్ 2019లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో.. ఈ సారి కాకినాడ ఎంపీగా, పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం సాగింది. ఇప్పుడు పవన్ స్వయంగా తాను పోటీ చేస్తానని చెప్పారు.

Pawan Kalyan decided to contest from Pithapuram against Vanga Geetha in up coming Elections

తాను 2019 ఎన్నికల్లో తాను తొలుత అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేయాలని భావించాన్నారు. ఆ తరువాత భీమవరం, గాజువాక నుంచి పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రచారం ముగిసిన తరువాత తాను భీమవరం లో ఓడిపోతానని తెలిసిందని చెప్పుకొచ్చారు. అప్పుడే గాజువాక లోనూ ఓడిపోతానని తెలిసిందన్నారు.

ఏకపక్షమా - హోరా హోరీనా
2009 నుంచి పిఠాపురం లోనే తాను పోటీ చేయాలని సూచించారని...ఇప్పుడు పోటీకి దిగుతున్నానని స్పష్టం చేసారు.ప్రజారాజ్యం 2009లో పిఠాపురం సీటు గెలుచుకుంది. ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా ప్రస్తుత వైసీపీ ఎంపీ వంగా గీత గెలిచారు. ఇప్పుడు వైసీపీ పిఠాపురం బాధ్యతలను వంగా గీతకు అప్పగించారు. గీత ఇప్పటికే అక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

ఇదే సమయంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ సీటు ఆశిస్తున్నారు. కొద్ది రోజులుగా స్థానికులే ముద్దు వంట నినాదాలతో అక్కడ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేసిన సమయంలో వర్మ స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో వర్మ ఏకంగా 47 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

గెలుపెవరిది
ఇప్పుడు ఎన్నికల్లో వర్మ పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది. పిఠాపురంలో 228206 ఓట్లు కాపు వర్గానికి సంబంధించినవి ఉన్నాయి. ఇతరుల ఓట్లు 91000 వేల వరకు ఉన్నాయి. మెజార్టీ కాపు వర్గం కావటంతో జనసేన నుంచి ఎవరు పోటీ చేసినా గెలవటం ఖాయమనే అభిప్రాయం ఉంది. అయితే, వర్మ కు స్థానికంగా ఉన్న పట్టు..ఆయన సహకారం కీలకం కానుంది.

గీత గతంలో ఇక్కడ గెలిచి ఉండటంతో పాటుగా కాపుల్లో కొన్ని వర్గాల మద్దతు గీతకు కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు పవన్ స్వయంగా పోటీకి దిగుతుండటంతో వైసీపీ ఎలాంటి గేమ్ ఇక్కడ మొదలు పెడుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే లక్ష్యంతో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు పిఠాపురం పోరు మరింత ఉత్కంఠ పెంచటం ఖాయంగా కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+