పిఠాపురంలో దారి తప్పుతున్న పవన్ వ్యూహం..!!

జనసేనాని పవన్ కు ఈ సారి ఎన్నికల్లో గెలుపు రాజకీయ భవిష్యత్ కు కీలకం. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నారు. తాను పోటీ చేసే నియోజకవర్గం ప్రకటన పైన పవన్ ఆలస్యం చేసారు. ప్రచారానికి సమయం తక్కువగా ఉంది. అక్కడ టీడీపీ ఇంఛార్జ్ వర్మ పైనే పవన్ గెలుపు బాధ్యతలు ఉంచినట్లు పవన్ చెప్పారు. కానీ, తాజాగా పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పార్టీలో చర్చగా మారుతోంది. ఎవరికి అనుకూలంగా మారుతుందనేది ఆసక్తిని పెంచుతోంది.

స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం
పిఠాపురంలో పవన్ పోటీకి దిగటంతో అక్కడి ఫలితం పైన ఆసక్తి మొదలైంది. వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య పోరు పైన అంచనాలు భిన్నంగా ఉన్నాయి. గీత గతంలో ప్రజారాజ్యం నుంచి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాజ్యసభ సభ్యురాలిగా, కాకినాడ ఎంపీగా, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా ఈ ప్రాంతంతో గీతకు సత్సంబంధాలు ఉన్నాయి. గత మూడు నెలల కాలంగా వంగా గీత పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటన వచ్చిన తరువాత వర్మ మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ తరువాత అంతా సర్దుబాటు అయింది. తన గెలుపు బాధ్యత వర్మదేనని పవన్ తేల్చి చెప్పారు.

Pawan Kalyan decision in Pithapuram leads to new disucssion in the own party leaders

హోరా హోరీ
పవన్ ను గెలిపించే బాధ్యత తనదేనని వర్మ స్పష్టం చేసారు. పవన్ ను ఓడించటమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు అమలు చేస్తోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడతో పాటుగా ముఖ్య నేతలు నిరంతరం పిఠాపురం లో పరిస్థితుల పై ఆరా తీస్తున్నారు. ఈ నెల చివరి వారంలో పిఠాపురంలో జగన్ భారీ బహిరంగ సభకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ సమయంలో జనసేన తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఈ జాబితా పైన కూటమి నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో ఉన్నవారితో ప్రచారం చేయించటం పైన అభ్యంతరం వ్యక్తం లేకపోయినా..వారిని మాత్రమే స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించటం పైనే సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. వీరిలో కొందరు ఇప్పటికే పిఠాపురంలో ప్రచారం ప్రారంభించారు.

నిర్ణయం మారేనా
ప్రస్తుతం పిఠాపురంలో సామాజిక సమీకరణాల ఆధారంగా ఎన్నిక జరుగుతోంది. పవన్ కు మద్దతుగా నిలుస్తుందనే ఒక ప్రధాన వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న కారణంగానే జనసేనాని ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. వంగా గీత సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో పాటుగా సంక్షేమం, అన్ని వర్గాల మద్దతు వైసీపీకి కలిసి వస్తుందనే అంచనాతో ఉన్నారు. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ల పేరుతో పిఠాపురంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఎన్నికల్లో కొందరు చేస్తున్న ప్రచారం పైన వర్మ క్యాంపులోనూ వ్యతిరేకత కనిపిస్తోంది. స్థానిక అంశాలను వదిలి కేవలం పవన్ ను ఆకాశానికి ఎత్తేలా ప్రచారం చేస్తే మొత్తానికే నష్టం వస్తుందని హెచ్చరిస్తున్నారు. దీంతో..ఇప్పుడు పవన్ ఈ విషయంతో తన నిర్ణయానికే కట్టుడి ఉంటారా..వర్మ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+