పవన్ విడాకులపై పోస్టులు..! ఇద్దరు అరెస్ట్, 42 మందికి నోటీసులు..!
ఏపీలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన మూడో భార్య అన్నా లెజ్ నోవాకు తాజాగా విడాకులు ఇచ్చారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నామని, తమ నిర్ణయాన్ని, ప్రైవసీని గౌరవించాలని ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అధికార కూటమిని నడుపుతున్న టీడీపీతో పాటు విపక్ష వైఎస్సార్సీపీ కూడా వేర్వేరు ప్రకటనల్లో తమ కార్యకర్తలు, అభిమానుల్ని ఈ వ్యవహారంపై స్పందించవద్దని కోరాయి. దీంతో దాదాపుగా అంతా సైలెంట్ గా ఉన్నారు.
కానీ సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పలువురు పోస్టులు పెట్టారు. ఇందులో ఓ ఎన్టీఆర్ అభిమాని కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారంపై అనుచిత పోస్టులు పెట్టిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. అనంతరం వీరిలో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇందులో బెంగళూరు ఎన్టీఆర్ ఫ్యాన్ విశ్వ తారక్, గుంటూరు జిల్లా వడ్డేశ్వరానికి చెందిన రవీంద్రబాబు కూడా ఉన్నట్లు సమాచారం.

అలాగే సోషల్ మీడియాలో పవన్ పై పోస్టులు పెట్టిన మరో 42 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసారు. పిఠాపురం జనసేన నేతల ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. పవన్ విడాకుల అనంతరం ఆయన మూడు పెళ్లిళ్లు, విడాకులు, భవిష్యత్తులో నాలుగో పెళ్లి చేసుకుంటారని ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఐటీ చట్టం కింద వీరిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. చట్టప్రకారం వీరికి నోటీసులు జారీ చేసి అరెస్టు చేసి విచారించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ మూడో విడాకులపై పోస్టులు పెట్టేందుకు మిగతా వాళ్లు భయపడాల్సిన పరిస్దితి ఎదురవుతోంది.














Click it and Unblock the Notifications
