పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నా అంత్యక్రియలు జరగాలి: అభిమాని ఆత్మహత్య
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో జిమ్ ట్రైనర్ అనిల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చనిపోవడానికి ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. తనకు జనసేనాని చేతుల మీదుగా అంత్యక్రియలు జరగాలని ఆ లేఖలో కోరారు.
ఇది తన చివరి కోరిక అన్నారు. తన చివరి కోరిక నెరవేర్చాలని అనిల్ కుమార్ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆయన జనసేనానికి ఎప్పటి నుంచో పెద్ద అభిమాని. జనసేన పార్టీ కోసం పని చేస్తున్నారు కూడా. అనిల్ విజయవాడలోని తల్ వాకర్స్ జిమ్‌లో ట్రెయినర్‌గా పని చేస్తున్నాడు.

అనిల్ గత కొద్ది రోజులుగా తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను పవన్ అభిమానిని అని, తాను చనిపోయిన తర్వాత తనను చూసేందుకు ఆయన రావాలని లేకలో పేర్కొన్నారు. పవన్ వస్తారని, తన అంత్యక్రియలు ఆయన చేతుల మీదుగానే జరుగుతాయని కూడా లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications