ఆ పనితో ఫుల్ ఖుషీగా పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఏపీలో పాలనాపగ్గాలు చేపట్టి ఆయన పరిధిలో ఉన్న శాఖల పనితీరును మెరుగుపరచడానికి యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్న విషయం తెలిసిందే. ఓ పక్క ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ మరోవైపు ఇదే సమయంలో జనసేన సభ్యత్వాలపైన కూడా ఫోకస్ పెట్టారు.
జనసేనకు ప్రజల నుండి విశేష ఆదరణ
ఈనెల 18వ తేదీన ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. గతానికి భిన్నంగా ఈసారి జనసేన సభ్యత్వాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల సభ్యత్వాలు నమోదు అయినట్టు జనసేన పార్టీ సీనియర్ నేత నాగబాబు తాజాగా వెల్లడించడం జనసేన పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలకు అద్దం పడుతుంది.

సభ్యత్వాల్లోనూ జనసేన రికార్డులు
గతేడాది కంటే భారీగా సభ్యత్వాలు నమోదు కావడం పట్ల ప్రజలు జనసేన పార్టీని ఆదరించడం పట్ల పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో 100 % స్ట్రైక్ రేటుతో 21 మంది జనసేన అభ్యర్థులను గెలిపించిన ప్రజలు ఇప్పుడు జనసేన బాట పడుతున్నారు. గతంలో ఆరు లక్షల 47 వేల సభ్యత్వాలు నమోదు కాగా ఈసారి ఇప్పటికే 10 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి.
జనసేన వైపే జనం చూపు
ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో సభ్యత్వాల నమోదు గడువును మరో వారం రోజులు పెంచి ప్రతి నియోజకవర్గంలో 5000 సభ్యత్వాలు చేయాలని నాగబాబు పార్టీ నేతలకు సూచించారు. జనసేన పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తన మార్కు పాలన చూపిస్తున్న క్రమంలో చాలామంది ఇప్పుడు జనసేన సభ్యత్వం తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
సంతోషంలో పవన్ కళ్యాణ్
పార్టీ పెట్టిన నాటి నుండి అష్టకష్టాలు ఎదుర్కొని, పదేళ్ళ కాలంలో దారుణమైన ఓటములను చూసిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఏపీ రాజకీయాలలో నిలదొక్కుకునే అవకాశం వచ్చింది. ఇప్పటికే గత ఎన్నికల ఫలితాల సంతోషంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా పార్టీలో సభ్యత్వాల నమోదు ఇస్తున్న జోష్ తో మరింత ఖుషీగా ఉన్నారు.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications