సీట్ల సర్దుబాటులో పవన్ కోరుకున్నట్లే జరిగిందా..? అక్కడే అసలు ట్విస్ట్..!!

ఏపీలో స్థానిక సమరం మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది దాదాపు నిర్ణయానికి వచ్చారు. అధికారిక ప్రకటన మిగిలి ఉంది. అటు వైసీపీ తమ అభ్యర్ధుల జాబితా సిద్దం చేసింది. కూటమి మధ్య సీట్ల సర్దుబాటులో పవన్ కోరిన సీట్లు.. జనసేనకు కేటాయింపు పైనే ఎక్కువగా చర్చ జరిగింది. ఇప్పుడు సీట్ల సంఖ్య తేలటంతో పవన్ కోరుకున్నట్లుగా సీట్లు దక్కాయా.. బీజేపీ ఏమంటోంది.. కూటమి ఇక ఏకపక్షంగా విజయం సాధిస్తుందా అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.

స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ స్థానాల పైన కూటమిలోని మూడు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. సుదీర్ఘ చర్చల తరువాత స్థానాల పైన స్పష్టత వచ్చింది. ఈ ఎన్నికల్లో జనసేన బలం ఉన్న స్థానా ల్లో పోటీ చేస్తుందని... 2024 ఫార్ములా వర్తించదని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. సీట్ల పైన చర్చ వేళ మంత్రి దుర్గేశ్ సహా పలువురు నేతలు తమకు 40 శాతం సీట్లు దక్కాలని లెక్కలతో సహా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసారు. చర్చల వేళ పవన్ తమ పార్టీకి సీట్ల కేటాయింపు విషయంలో పట్టు బిగించినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. సుదీర్ఘ చర్చల తరువాత మూడు పార్టీల కు సీట్ల ఖరారు పైన స్పష్టత వచ్చింది. అందులో భాగంగా విజయవాడ, కాకినాడ, శ్రీకాకుళం, ఏలూరు కార్పొరేషన్లు జనసేనకు కేటాయించటం ఖాయమని తెలుస్తోంది. కాగా, తిరుపతి పైనా చర్చ జరుగుతోంది. అధికారిక ప్రకటనతో స్పష్టత రానుంది.

ఎట్టకేలకు బీజేపీ, జనసేన సీట్లు ఖరారు - ఆ స్థానం పైనే పీఠముడి, జాబితా..!!
ఎట్టకేలకు బీజేపీ, జనసేన సీట్లు ఖరారు - ఆ స్థానం పైనే పీఠముడి, జాబితా..!!
pawan-kalyan-gets-the-seats-he-wanted-janasena-s-share-in-local-poll-here-the-detail-report

తుది జాబితా ప్రకటనతో స్పష్టత

అదే విధంగా మున్సిపాలిటీల్లో పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలు, తుని, అమలాపురం, మండపేట, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, రంపచోడవరం, జగ్గయ్యపేట, రేపల్లె, తెనాలి, పొన్నూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, దర్శి, కావలి, శ్రీకాళహస్తి, మదనపల్లె, పుట్టపర్తి, ఆదోని స్థానాలు చర్చకు వచ్చాయి. నగర పంచాయతీల్లో పాలకొండ, నెల్లిమర్ల, ముమ్మిడివరం, మడకశిర పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మొత్తంగా జనసేనకు నాలుగు కార్పొరేషన్లు, 20 నుంచి 24 మున్సిపాలిటీలు, మూడు నుంచి నాలుగు నగర పంచాయతీలు దక్కుతాయని తెలుస్తోంది. ఈ సారి జనసేన నేతలు పెద్ద సంఖ్యలో తమకు పోటీకి అవకాశం వస్తుందనే అంచనాతో ఉన్నారు. ఇక.. జెడ్పీటీసీ.. ఎంపీటీసీ సీట్ల పైనా చర్చలు జరగనున్నాయి. అయితే.. జనసేనకు కేటాయించినట్లుగా చెబుతున్న కార్పోరేషన్లలో కాకినాడ, శ్రీకాకుళం కు ఇప్పుడు ఎన్నికలు జరగటం లేదు. దీంతో.. జనసేనకు సీట్ల ఖరారు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+