pawan kalyan : మోడీ "మన్ కీ బాత్ "పై పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు-ఏమన్నారంటే ?
ప్రధాని మోడీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' కార్యక్రమం 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా నిర్వహిస్తోన్న 'మన్ కీ బాత్' కార్యక్రమం ఈ నెల 30వ తేదీతో 100 ఎపిసోడ్లు పూర్తవుతున్న శుభ సందర్భంలో వారికి తన శుభాభినందనలు తెలియజేస్తున్నట్లు పవన్ తన తాజా వీడియోలో వెల్లడించారు.
దేశ ప్రధాని దేశ వాసులతో రేడియో మాధ్యమం ద్వారా స్వయంగా ముచ్చటించే ఈ కార్యక్రమం శ్రోతలకు, తదుపరి టీవీ ప్రసారాల్లో చూసే వీక్షకులకు ఎంతో చేరువైందని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. గణాంకాలు ఒకసారి పరిశీలిస్తే ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని 100 కోట్ల మంది ప్రజలు ఒక్కసారైన రేడియోలో వినడమో, టీవీలో చూడటమో జరిగిందన్నారు. ప్రతి నెల 23 కోట్ల మంది ఆదరిస్తున్నారని తెలిసి సంతోషం వేసిందన్నారు.

2014 అక్టోబర్ 3న విజయదశమి నాడు ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం నాడు నిరంతరాయంగా కొనసాగుతుండటం అద్భుతమైన విషయమని పవన్ పొగడ్తల జల్లు కురిపించారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో ప్రస్తావించే అంశాలు చాలా విభిన్నంగా ఉంటాయని పవన్ తెలిపారు. సామాన్యులు సాధించే విజయాలు, గొప్ప వ్యక్తులు, కళలు, చేతివృత్తులు, సేవా కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు... ఇలా అనేక అంశాలు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు దగ్గర చేశాయన్నారు.
మోడీ "మన్ కీ బాత్ "పై పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు-ఏమన్నారంటే ?#PawanKalyan #Modi #PMModi #NarendraModi #MannKiBaatAt100 #MannKiBaatConclave #MannKiAtBaat100 #Oneindiatelugu pic.twitter.com/UCUVNjbMGM
— oneindiatelugu (@oneindiatelugu) April 29, 2023
దానికి తోడు మోదీ వాక్పటిమ, వివిధ అంశాలపై వారికున్న విశేష అనుభవం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత దగ్గర చేసిందని పవన్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభ సందేశంలో "సేవా పరమో ధర్మః" అని మోదీ పేర్కొనడం మనసులను హత్తుకునే విధంగా ఉందని పవన్ తెలిపారు. ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి, కార్యక్రమ నిర్వాహకులకు పవన్ తన శుభాకాంక్షలు తెలిపారు.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications