పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేదిక ఫిక్స్, మేకర్స్ ప్లాన్ అదుర్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఎప్పుడెప్పుడా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు విడుదల తేదీ దగ్గర పడుతుంది. దీంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసింది. జూన్ 12వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ వేడుక చేసుకోబోతోంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫైనల్
ఈ వేడుకను నిర్వహించడానికి చిత్ర యూనిట్ భారీగా సన్నాహాలను చేస్తుంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది ప్రతి ఒక్కరిలోనూ భారీ అంచనాలను కలిగిస్తోంది. అయితే పవన్ ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ఈనెల 8వ తేదీన నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది చిత్రయూనిట్. ఈ గ్రాండ్ ఈవెంట్ కు వేదికను ఫైనలైంది.

తిరుపతిలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్
తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ మైదానంలో ఈనెల 8వ తేదీన ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. దీనికోసం పవన్ కళ్యాణ్ ఈనెల 7వతేదీన తిరుపతి చేరుకోనున్నారు. ఈ క్రమంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఇప్పటికే సినిమాకు సంబంధించి చెన్నైలో ఇటీవల సాంగ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది.
సినిమాపై భారీ అంచనాలను పెంచే పనిలో మేకర్స్
ఇప్పుడు సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇక తిరుపతిలో నిర్వహించే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పైన అభిమానుల భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అయితే సినిమాపై కూడా అంచనాలు మరింత భారీగా పెరుగుతాయని ఈ ఈవెంట్ ద్వారా అంచనాలను మరింత పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు.17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా చారిత్రక యాక్షన్ చిత్రంగా సాగుతుంది.
హరిహర వీరమల్లు సినిమా నేపధ్యం ఇదీ
క్రిష్ జాగర్లమూడి , ఎం ఎం జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మొఘలుల నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే సాహసోపేతమైన బాధ్యతను తీసుకున్న ఒక పురాణ బందిపోటు వీరుడి కథ హరిహర వీరమల్లు సినిమా. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి వంటి అగ్ర తారలు కీలక భూమిక పోషిస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉంటుంది? జోరుగా చర్చ
ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం, ఏపీ రాజకీయాలలో సంచలనం, సినిమాలలో తనదైన మార్క్ వేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా హరిహర వీరమల్లు ఎలా ఉంటుంది? అన్నది అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. అయితే ఈ సినిమా ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని చిత్ర వర్గాలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. గొప్ప డైరెక్టర్లు అయిన క్రిష్ జాగర్లమూడి, ఎం ఎం జ్యోతి కృష్ణ డైరెక్షన్ అద్భుతంగా ఉండబోతుందని సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది.












Click it and Unblock the Notifications