Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఘటన తనను కలచివేసింది: పవన్ కళ్యాణ్ ఆవేదన!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో తాజా పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వానికి మహిళల రక్షణపై ఎటువంటి చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

నేడు జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏపీలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై అధికారపక్షం ఎందుకు మౌనం వహిస్తుంది? ఎందుకు మాట్లాడటం లేదు? చెప్పాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ దురాగతాలపై స్పందించవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఏపీలో విద్యార్థులు, బాలికల అనుమానాస్పద మృతి అత్యాచార ఘటనలపై జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.

Pawan Kalyan has made sensational comments on the latest situation in AP

చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థిని హత్యకు గురైన ఘటనపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ విద్యార్థిని హత్యకు గురైతే సీఎం జగన్ మోహన్ రెడ్డి, హోమ్ మంత్రి తానేటి వనిత, మహిళా కమిషన్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. విద్యార్థిని హత్యను అనుమానాస్పద మృతి అని అధికారులు కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని సందేహాలు వ్యక్తమవుతున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

బాలిక తల్లిదండ్రుల ఆందోళనను, వేదనను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు విజయనగరం జిల్లాలో తుగుట్టలో దళిత బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలచివేసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణ, శాంతిభద్రతల స్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

ఆడపిల్లలు, మహిళలకు రక్షణ కరువైందన్న మాట వాస్తవమని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఏపీలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మహిళలను వేధించే వాళ్లపై కఠినంగా వ్యవహరించకుండా పోలీసుల చేతులను పాలకపక్షం కట్టి వేస్తోందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేకసార్లు ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ తాజాగా మరోమారు మహిళా రక్షణపై వైసిపి సర్కారును ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+