దటీజ్ పవన్ కళ్యాణ్.. కానిస్టేబుల్ అభ్యర్ధి విన్నపానికి ఆన్ స్పాట్ యాక్షన్ !!
ఏపీలోని మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత.. కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ వేడుకలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఓ అభ్యర్థి విన్నపం విన్న నిమిషాల వ్యవధిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రహదారి మంజూరు చేశారు.
ఏం జరిగిందంటే..?
కాగా కానిస్టేబుల్ గా నియమితుడైన గిరిజన యువకుడు లాకే బాబూరావు తన సక్సెస్ స్టోరీ వివరించే క్రమంలో తన గ్రామానికి రోడ్డు వేయించమని సీఎం చంద్రబాబును కోరారు. బాబూరావు కోరిక మేరకు గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న డిప్యూటీ సీఎంకు అప్పగించారు సీఎం. దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి, అనుమతులు ఇవ్వాలని పవన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి పవన్ కు అందించారు. వెంటనే అల్లూరి జిల్లా కలెక్టర్ రోడ్డు అనుమతికి పరిపాలన అనుమతులు ఇచ్చారు. దీంతో వేదిక మీద ఉండగా రోడ్డు గురించి విజ్ఞప్తి చేయగా సభ ముగిసే లోపే రోడ్డు మంజూరు చేయడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అంతకు ముందు కూడా..
అంతే కాకుండా ఇటీవల అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక వినతి మేరకు.. పవన్ ఆమె గ్రామానికి కూడా రోడ్డు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎంని కలిసిన రోజు ఉదయం ఆమె రోడ్డు కోసం విజ్ఞప్తి చేయగా.. సాయంత్రానికి ప్రణాళిక రూపొందించి నిధులు మంజూరు చేశారు. దీంతో ఆడగడమే ఆలస్యం వినతులను నెరవేరుస్తున్న పవన్ కళ్యాణ్ కి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ వరుస ఘటనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
స్టేజ్ మీద దృష్టికి వచ్చిన సమస్య స్టేజ్ మీదే పరిష్కారం - తన దృష్టికి వచ్చిన సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan
— JanaSena Party (@JanaSenaParty) December 16, 2025
నూతనంగా నియామకం జరిగిన కానిస్టేబుల్ నియామక పత్రాలను అందించే కార్యక్రమంలో తన ఊరుకు రోడ్డు సదుపాయం కావాలని కోరగా,… pic.twitter.com/dBDQ98yrDJ












Click it and Unblock the Notifications