రాజకీయాల్లో గేమ్ ఛేంజర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్: మహేష్ బాబు, మంచు మనోజ్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ఘనవిజయం సాధించింది. త్వరలోనే ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. టిడిపి కూటమి ఘనవిజయం సాధించడం ఒక ఎత్తు అయితే, ఏపీ రాజకీయాలలో దశాబ్దకాలంగా పోరాటం చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధించిన విజయం మరో ఎత్తు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాదు జనసేన తరపున ఎన్నికల బరిలోకి దిగిన ప్రతి ఒక్కరు విజయం సాధించారు.
పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షల వెల్లువ
100% రిజల్ట్స్ తో జనసేన ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. జనసేన సాధించిన ఈ విజయం పట్ల జనసేన పార్టీ నేతలు మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమ నుండి రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికలలో ఘనవిజయం సాధించడం పట్ల స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Congratulations on your remarkable win, @PawanKalyan! Your victory is a reflection of the faith and confidence people have placed in you. Wishing you a tenure filled with success in realizing your dreams for our people.
— Mahesh Babu (@urstrulyMahesh) June 5, 2024
పవన్ కళ్యాణ్ పై మహేష్ బాబు, మంచు మనోజ్ ట్వీట్ లు
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు, మంచు మనోజ్ లు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ విజయం సాధించడంపైన స్పందించారు. మీ అద్భుతమైన విజయానికి అభినందనలు అంటూ మహేష్ బాబు పేర్కొన్నారు.
మీరు ప్రజల కోసం కన్న కలలు సాకారమవ్వాలి : మహేష్ బాబు
ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన ఆయన ప్రజలు మీపై ఉంచిన విశ్వాసం మరియు నమ్మకం మీ విజయానికి ప్రతిబింబం అని ప్రజల కోసం మీరు కన్న కలలను సాకారం చేయడంలో మీరు విజయవంతం కావాలని మహేష్ బాబు పేర్కొన్నారు. ఈ పదవీకాలం మిమ్మల్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నట్టు మహేష్ బాబు ట్వీట్ చేశారు.
Special congratulations to our real POWER STAR @PawanKalyan garu who has become the Game Changer & The Power Star yet again with the landslide win.
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 5, 2024
Your journey has been a true inspiration to everyone anna. Overcoming challenges and emerging this victorious is commendable.
May… pic.twitter.com/tEdPzlIubC
నిజమైన స్ఫూర్తి... మంచు మనోజ్
ఇక మంచు మనోజ్ కూడా తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. మా నిజమైన పవర్ స్టార్ కు ప్రత్యేక అభినందనలు అంటూ పేర్కొన్న మంచు మనోజ్ పవన్ కళ్యాణ్ ఘనవిజయంతో మరోసారి గేమ్ చేంజర్ అయ్యారని, మీ ప్రయాణం ప్రతి ఒక్కరికి నిజమైన స్ఫూర్తినిస్తుంది అన్నా అంటూ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ పట్ల మంచు మనోజ్ ప్రేమ
సవాళ్లను అధిగమించి విజేతగా నిలవడం అభినందనీయమని మీ ప్రయాణం మరిన్ని విజయాలతో ప్రజాసేవ తో నిండి ఉండాలని తాము ఎల్లప్పుడూ కోరుకుంటున్నామన్నారు. అంతే కాదు మేము ఎల్లప్పుడూ మీతో పాటే ఉంటామంటూ మంచు మనోజ్ పవన్ కళ్యాణ్ పట్ల తన ప్రేమను వ్యక్తీకరించారు.












Click it and Unblock the Notifications