దేశ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం కూడా రేపటితో ముగుస్తుంది. దీంతో ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. అయితే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నిజంగానే ప్రత్యేకం. ఇక అన్ని పార్టీల లెక్క ఒక ఎత్తు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లెక్క మాత్రం వేరే..
రాజకీయాల్లో జనసేనాని డేరింగ్ స్టెప్
ఏపీలో రాజకీయాలు ప్రారంభించిన నాటి నుండి పవన్ కళ్యాణ్ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గత పదేళ్లుగా ఆయన పార్టీని నడుపుతున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైనా ఆయన మొక్కవోని ధైర్యంతో మళ్ళీ ఏపీ ఎన్నికల బరిలోకి దిగారు. ఒక్క స్థానం కూడా గెలవకుండా పదేళ్ళ పాటు ఒక రాష్ట్రంలో పార్టీని కీలకంగా ముందుకు నడపటం చాలా కష్టం.. అయినప్పటికీ జనసేనాని దానిని చేసి చూపించారు.

తాను తన పదేళ్ళ జీవితాన్ని ఆంధ్రా ప్రజల కోసం ధారపోశానన్న పవన్
తనను గత ఎన్నికల్లో ఆదరించని ప్రజల సమస్యల కోసం ఆయన పోరాటం చేశారు. ఇప్పుడు ఎన్నికల కురుక్షేత్రంలో హోరాహోరీగా పోరాటం చేస్తున్నారు. ఈ దేశంలో ఒక్క ఎమ్మెల్యే లేకుండా దశాబ్ద కాలం పార్టీని నడిపిన ఏకైక రాజకీయ నాయకుడ్ని నేను అంటూ తాజాగా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తాను చాలా బలంగా నిలబడగలనని, తన జీవితాన్ని దశాబ్ద కాలం ఆంధ్రా ప్రాంత ప్రజల కోసం ధారపోశానన్నారు.
ఈ దేశంలో ఒక్క ఎమ్మెల్యే లేకుండా దశాబ్ద కాలం పార్టీని నడిపిన ఏకైక రాజకీయ నాయకుడ్ని నేను!#PawanKalyanWinningPithapuram #VoteForGlass #Pithapuram pic.twitter.com/Exgb34XzST
— JanaSena Party (@JanaSenaParty) April 23, 2024
వారసత్వంగా రాజకీయాల్లోకి రాలేదు
తాను తాతల, తండ్రుల వారసత్వంగా రాజకీయాలలోకి వచ్చిన వాడిని కాదని, మొదటితరం రాజకీయ నాయకుడినని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అందరూ ఆలోచించేలా చేసింది. తానూ మధ్యతరగతి వాడినని, మధ్యతరగతి ప్రజల కష్టాలు తనకు తెలుసనీ పేర్కొన్న ఆయన కేవలం రాష్ట్ర ప్రజల కోసం ఇంత దూరం వచ్చానని, ఇప్పుడు వెనక్కు వెళ్ళలేనన్నారు.
ఎలాంటి పదవులు లేకున్నా పదేళ్ళ నుండి పవన్ రాజకీయం
రాష్ట్రంలో ఈసారైనా ప్రజా సంక్షేమ పాలన సాగించటం కోసం తమ పార్టీ సీట్లు వదులుకుని పొత్తులకు వెళ్లామని చెప్పారు. నిజంగానే ఆయన దేశంలోనే బలమైన రాజకీయ నాయకుడు.. ఎలాంటి పదవులు లేకున్నా పదేళ్ళ నుండి ఏపీలో పోరాటం చేస్తున్న నాయకుడు. మరి ఆయన మాటలు జనసేన ఓటు బ్యాంకును పెంచుతుందా? ఈసారైనా ఆయన రాజకీయాల్లో కీలకంగా మారతారా? తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications