Pawan kalyan: దుమ్మురేపుతున్న జనసేన జంగ్ సైరన్.. చూస్తే గూస్ బంప్స్ పక్కా!!
ఈసారి ఎన్నికలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. 2014ఎన్నికలకు ముందే ఏపీలో రాజకీయాలను ప్రారంభించిన జనసేన 2014లో పోటీ చేయకపోగా, 2018లో పోటీచేసి కేవలం ఒక్క స్థానంలోనే గెలిచి, ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో రాజకీయాలలోనే కొనసాగుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజకీయాలు చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం రాజకీయాలను కొనసాగిస్తున్నారు.
అనేక సమస్యలపైన తనదైన పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్, ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖంగా పావులు కదుపుతున్నారు.
తన బహిరంగసభలకు వచ్చే జనాలంతా ఓటర్లు కాదని గుర్తించిన పవన్, తాను రాజకీయాల్లోకి వచ్చిన ఉద్దేశాన్ని, జనసేన పార్టీ గుర్తును బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సంకల్పించి వినూత్న ప్రయోగం చేస్తున్నారు.

సినిమాటిక్ స్టైల్ లో అనేక వీడియోలను, పాటలను నిత్యం సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో ఉన్నారు. తాను రాజకీయాల్లోకి రావడం వెనుక ప్రధాన ఉద్దేశాన్ని ప్రజలకు చెప్పడం లక్ష్యంగా వీడియోలను చేస్తున్నారు. విన్న దాని కంటే, దృశ్యం ఎక్కువగా ఆకట్టుకుంటుందని నమ్మిన పవన్ కళ్యాణ్ ఈసారి సోషల్ మీడియా ప్రచారంపై ఫుల్ గా ఫోకస్ పెట్టారు.
ఇక ఈనెల 30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో జనసేన జంగ్ సైరన్ పేరుతో పాటను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. పాట విన్న ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తున్నాయంటే ఆ పాటను ఏ రేంజ్ లో రాశారో అర్థం చేసుకోవచ్చు.
భగ భగ భగ మండిన భగత్ సింగ్ రా పవన్.. జనసేన జెండా ఎత్తి ఊదే జంగ్ సైరన్ అంటూ సాగిన పాటలో బంగారు పళ్లెంలో తినే పవన్, మనతో కలిసి పంక్తి భోజనం చేయడానికి వచ్చాడని, ఎత్తయిన మేడల్లో సుఖంగా బ్రతకడాన్ని వదిలేసి, మన చెట్టు నీడ కోసం మన చెంతకు వచ్చాడని పాట ద్వారా చెప్పారు.
"జనసేన జంగ్ సైరన్" #VoteForGlass | #JSPFutureOfAP pic.twitter.com/pxhxWWkJOO
— JanaSena Party (@JanaSenaParty) March 21, 2024
బంగారం లాంటి బ్రతుకుని వదిలిపెట్టి, మన బ్రతుకులు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని పాటలో స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో రేపుతుంది. పవన్ కళ్యాణ్ ని ఎందుకు ఆదరించాలి? గాజు గ్లాసుకు ఎందుకు ఓటెయ్యాలి? జనసేన రాజకీయ ప్రస్థానం ఏమిటి? ఇంతకాలం పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం ఏమిటి? అన్న ప్రతి అంశాన్ని కళ్ళకు కట్టినట్టు ఈ పాట ద్వారా చూపించారు.












Click it and Unblock the Notifications