నాగబాబుకు మరోసారి హ్యాండ్ : ఎమ్మెల్సీ-మంత్రిగా నో ఛాన్స్, తెర వెనుక..!!
ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ, ఆ తరువాత మంత్రి అవుతారని కూటమి నేతలు భావించారు. నాగబాబుకు మంత్రి పదవి పైన చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల భర్తీ పైన కసరత్తు కొనసాగు తోంది. ఈ క్రమంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని చెబుతున్నా... ఇప్పుడు ఆ ఛాన్స్ లేదని స్పష్టం అవుతోంది. అసలు నాగబాబు విషయంలో ఎందుకీ డైలమా.. ఏం జరుగుతోంది..
నాగబాబుకు నో ఛాన్స్
ఎమ్మెల్యే కోటా లో అయిదు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పైన చంద్రబాబు - పవన్ చర్చించారు. మెగా బ్రదర్ నాగబాబుకు ఎమ్మె ల్సీ - మంత్రి పదవి పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ స్థానాల ఖరారు వేళ నాగబాబును ఎమ్మెల్సీ చేసి.. మంత్రి పదవిలోకి తీసుకుంటామని నాడు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు భర్తీ చేయాల్సిన అయిదు స్థానాల పైన ఈ ఇద్దరి మధ్య చర్చలో చివరి నిమిషంలో పవన్ నుంచి అనూహ్య ప్రతిపాదన వచ్చింది. నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి వద్దని.. రాజ్యసభకు పంపాలని కోరినట్లు తెలుస్తోంది. జనసేన కు ఇవ్వాలని భావించిన ఎమ్మెల్సీ సీటు బీజేపీకి ఇవ్వటం పైన చర్చ జరుగుతోంది.

చంద్రబాబు - పవన్ చర్చలు
నాగబాబుకు తొలుత 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని భావించారు. పొత్తు లో భాగంగా ఆ సీటు బీజేపీ కోరటంతో నాగబాబు తప్పుకున్నారు. ఇక, రాజ్యసభ ఇస్తారనే హామీతో ఆయన నిరీక్షించారు. కూటమికి కొద్ది నెలల క్రితం మూడు రాజ్యసభ స్థానాలు దక్కాయి. మారిన సమీకరణాలతో ఆ సమయంలోనూ నాగబాబుకు అవకాశం దక్కలేదు. అదే సమయంలో నాగబాబు కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. కాగా, ఎమ్మెల్సీ అయిన తరువాత కేబినెట్ లో చేరుతారని జనసేన నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా లో అయిదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ పైన కసరత్తు జరుగుతోంది. నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖాయం అని అందరూ భావించారు.
నాగబాబుకు దక్కేదేంటి
ఇదే సమయంలో అనూహ్యంగా మరోసారి నాగబాబుకు ఎమ్మెల్సీ రేసు నుంచి తప్పించినట్లు విశ్వసనీయ సమాచారం. నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి లేకపోవటంతో ఆయనకు మంత్రిగానూ ఛాన్స్ లేనట్లే. నాగబాబును రాజ్యసభకు పంపే ఆలోచన చేస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. కానీ, సాయిరెడ్డి స్థానంలో ఖాళీ అయిన సీటు బీజేపీ కోరుతోంది. దీంతో.. నాగబాబుకు రాజ్యసభ ఇప్పట్లో దక్కే అవకాశం కనిపించటం లేదు. ఇక.. రాష్ట్ర స్థాయిలో కీలకమైన ఛైర్మన్ పదవి ఇవ్వాల నే ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, నాగబాబుకు ఇలా పదవుల విషయం లో ఎందుకు నిర్ణయాలు మారుతున్నాయనేది సస్పెన్స్ గా కనిపిస్తోంది. అసలు నాగబాబుకు చివరకు ఏ పదవి దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications