చంద్రబాబును ఆకాశానికెత్తేసిన పవన్ కళ్యాణ్- ఏమన్నారో తెలుసా ?

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సీఎం, డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకే పార్టీ నేతల్లా కలిసిపోయారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఇరువురు పరస్పరం ప్రశంసలు కురిపించుకుంటున్నారు. ఇదే క్రమంలో విజయవాడ వరద సహాయక చర్యల్లో చంద్రబాబు పనితీరును ప్రశంసిస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. ఇందులో చంద్రబాబును ఆయన ఆకాశానికెత్తేశారు.

మీ మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించినందుకు ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పవన్ ట్వీట్ మొదలుపెట్టారు. అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ వారసత్వంగా గత ప్రభుత్వం నుండి వచ్చిందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం, వీటి నడుమ మీ పాలనా దక్ష్యత, విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయం అంటూ పవన్ కళ్యాణ్ పొగడ్తల జల్లు కురిపించారు.

pawan kalyan lauds Chandrababu s dedication during Vijayawada flood relief operation

మరోవైపు ఇలాంటి సమయంలో మన ప్రజలను ఆదుకోవడం మన ప్రభుత్వంతో పాటుగా వ్యక్తిగత స్థాయిలో నా కనీస బాధ్యతగా భావిస్తున్నానని పవన్ తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్, ఆర్ డబ్లూఎస్ శాఖలు యుద్దప్రాతిపదికన పాల్గొంటున్నాయని, త్వరలోనే మనం ఈ సంక్షోభం నుండి బయటపడుతామని ఆశిస్తున్నానని పవన్ కళ్యాణ్ తన ట్వీట్ ముగించారు. దీంతో ఈ ట్వీట్ ను టీడీపీ, జనసేన పార్టీల నేతలు రీట్వీట్లతో వైరల్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+