ముందే తెలుసు, ఫ్యాన్స్ కరెక్ట్!: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆనందం
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల మెగా అభిమానులు ఆనందిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిరంజీవి, ఆయన సోదరుడు పవన్ మధ్య నిశ్సబ్ద యుద్ధం ఉన్నట్లుగా కనిపిస్తున్న విషయం తెలిసిందే.
చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాక.. పవన్ మెగా కుటుంబ సభ్యుల పలు సినిమా ఫంక్షన్లకి రాలేదు. వారి మధ్య విభేదాలు వచ్చినట్లుగానే అందరు భావించారు. అయితే, మెగా అభిమానులు మాత్రం చిరు, పవన్‌ల మధ్య రాజకీయ విభేదాలే తప్ప ఇంకొకటి కనిపించదని చెబుతూ వస్తున్నారు.

మెగా సినిమా ఫంక్షన్లకు పవన్ హాజరు కాకపోవడం పైన చిరంజీవి సహా అందరు పలుమార్లు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా రోజుల తర్వాత గోపాల గోపాల ఆడియో ఫంక్షన్‌లో పవన్ తన అన్నయ్య చిరంజీవి గురించి చాలాసేపు మాట్లాడారు.
దీంతో, మెగా అభిమానులు ఆనందిస్తున్నారు. చిరంజీవికి, పవన్‌కు రాజకీయ విభేదాలు తప్పితే మరింకేమీ లేవని తాము మొదటి నుండి చెబుతున్నామని, ఇప్పుడు మేం చెప్పిందే నిజమైందని వారు అంటున్నారు. చాలా రోజుల తర్వాతనైనా పవన్ పెదవి విప్పడంతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications