టీటీడీ పాలకమండలి క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ హుకుం.. వైసీపీ కౌంటర్!

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది .ఒక్కసారిగా తొక్కిసలాట జరగడం వల్ల ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది వరకు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా టిటిడి అధికారులు, పోలీసు సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం వలన ఈ ఘటన జరిగిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

బాధిత కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు
సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘటన స్థలాన్ని పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించారు. అధికారుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తాజాగా పవన్ కళ్యాణ్ తిరుమల ఘటనపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమైన ఘటనగా చెబుతూ తిరుమలలో భక్తులకు, బాధిత కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ తెలిపారు.

Pawan Kalyan orders TTD Governing Council to apologize tirupati stampede victims families YCP counter

వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
తిరుమలలో చోటు చేసుకున్న ఘటన పైన టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జే ఈవో వెంకయ్య నాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులు బాధితులకు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇందులో ఏదో మొహమాట పడటానికి ఏమీ లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రతి బాధితుడి ఇంటికి వెళ్లి ఓదార్చాలని ఆయన తెలిపారు. బాధితులను పరామర్శించటానికి వెళ్ళినప్పుడు వారి మాటలు విని కరిగిపోయానని, కన్నీళ్లు ఆగలేదన్నారు.

వైరల్ అవుతున్న పవన్ క్షమాపణల వీడియో
వాళ్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన పైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రజల కష్టానికి కారణమైన టిటిడి బాధ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ పేర్కొనడం ఇప్పుడు ప్రతి ఒక్కరు పవన్ వ్యాఖ్యల ఆంతర్యాన్ని ఆలోచించేలా చేస్తుంది.

పవన్ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్
ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండి బాధితుల పక్షాన మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వ అధికారులను తన వ్యాఖ్యలతో టార్గెట్ చేయడం తెలుగు రాష్ట్రాలలో ఆసక్తిని కలిగిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ, క్షమాపణలు దేనికి అని పవన్ కళ్యాణ్ ను నిలదీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+