ఫ్యాన్ గాలి తీసేలా.. రేవంత్ రెడ్డి ఆదర్శంగా పవన్ కళ్యాణ్ ప్లాన్!!
ఏపీలో రానున్న ఎన్నికల ప్రచారంలో జనసేన కొత్త పంధా అనుసరిస్తుంది. జనసేన గాజు గ్లాసును ప్రమోట్ చేసేలా, ఫ్యాను పనికిరానిదని చెప్పేలా అనేక వీడియోలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అచ్చం తెలంగాణా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ , రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహాన్నే అమలు చేస్తుంది. ఫ్యాన్ పై పవన్ కళ్యాణ్ ప్లాన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణా కాంగ్రెస్ బాటలో జనసేన
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలపై కొనసాగుతున్న నిర్లక్ష్యంపై వీడియోలతో వరుస దాడి చేసిన కాంగ్రెస్ అధికారాన్ని సొంతం చేసుకుంది. ఇదే కోవలో జనసేన కూడా దృశ్యాన్ని నమ్ముకుంది. ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న కారును అప్పుడు కాంగ్రెస్ పెద్దఎత్తున ప్రచారం చేస్తే, పథకాలపేరుతో 10రూపాయలిచ్చి, ఏపీని అభివృద్ధి చేయకుండా ప్రజలకు 100రూపాయల నష్టం చేస్తుందని చెప్పేలా అనేక వీడియోలతో విరుచుకుపడుతుంది.

జగన్ పాలన ఎలా ఉందో చెప్పే పనిలో జనసేన
జగన్ చేసింది గోరంత... ఆయన కారణంగా మీకు ఖర్చయ్యేది కొండంత.. అని చెప్పే వీడియోలను ప్రజలలోకి తీసుకువెళ్ళే పనిలో ఉంది. ఫ్యాను కు సౌండ్ ఎక్కువ కానీ గాలి తక్కువ అంటూ ఫ్యాన్ పార్టీ ఇజ్జత్ తీసే పనిలో ఉంది. తాజాగా సోషల్ మీడియాలో జనసేన, పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసిన వీడియోలో జగన్ పాలన ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేశారు.
ఆలోచించే వీడియోలు పోస్ట్ చేస్తున్న జనసేన
జగన్ నిర్లక్ష్యం వలన ఏపీలో అధ్వాన్నంగా ఉన్న అ రోడ్లలో వెళుతున్న ఆటో పాడైపోవటం, ఇక ఆ ఆటోవాలా అదే సమయంలో జగన్ ప్రసంగాన్ని వినటం .. అందులో జగన్ జనాల బతుకులు బాగు చేస్తానని చెప్పటం కనిపిస్తుంది. ఆపై రిపేర్ కు వెళ్ళిన ఆటో బాగు చెయ్యాలంటే 50 వేలయినా ఖర్చు అవుతుందని ఆటో రిపేర్ చేసే వ్యక్తి చెప్పటంతో అప్పటికి ఆటోవాలాకు రియాల్టీ అర్ధం అవుతుంది.
ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి జీవితాలు అన్నీ అస్తవ్యస్తం!
— JanaSena Party (@JanaSenaParty) March 28, 2024
పథకాలు పేరుతో ఇచ్చినట్టే ఐచ్చి ప్రజల సంపాదన దోచుకున్న వైసీపీ ప్రభుత్వం..#HelloAP_ByeByeYCP👋 pic.twitter.com/ly7vHe76Mb
ఫ్యాన్ కు సౌండ్ తప్ప గాలి లేదు
ఆటోవాలాలకు 10 వేల రూపాయల జగన్నన్న చేయూత ఇచ్చి ఇలా నష్టం చేస్తున్నారని ఆటోవాలా అసహనంతో మాట్లాడతాడు. ఫ్యాన్ వెయ్యాలా అని ఆటో రిపేర్ చేసే వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఫ్యాన్ కు సౌండ్ తప్ప గాలి లేదని వ్యాఖ్యలు చేశాడు.. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
మూడు పార్టీల పొత్తు ఏపీకి బంగారు భవిష్యత్
ఈసారి ప్రతి ఒక్కరు కూటమిని ఆదరించాలని కోరుతూ ఈ మూడు పార్టీల పొత్తు ఏపీకి బంగారు భవిష్యత్ అంటూ పేర్కొన్న ఈ వీడియో మాత్రమే ఇలాంటి ఎన్నో వీడియోలు ఇప్పుడుఏపీలో జనాలను ఆలోచించేలా చేస్తున్నాయి. తెలంగాణా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కూడా ఇదే తరహా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. ఈ కరమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్తుంది.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..!











Click it and Unblock the Notifications