బ్లూ ఎకానమీ ప్రాజెక్ట్ తో సముద్రాన్ని లంఘించనున్న పవన్ కళ్యాణ్!!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీలో అడవులు, పర్యావరణ శాఖల మంత్రిగా అడవులను పరిరక్షించడానికి పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతుగా కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి పర్యావరణ హాని లేకుండా ఆదాయ వనరులను సమకూర్చే ఆలోచనలు చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ సముద్ర వనరుల సమర్థ వినియోగం, బ్లూ ఎకానమీ ప్రాజెక్టు అమలు అంశంపైన ప్రపంచబ్యాంకు ప్రతినిధులతోనూ, సీనియర్ పర్యావరణ శాస్త్రవేత్తలతో చర్చించారు.
బ్లూ ఎకానమీ ప్రాజెక్ట్ పై చర్చించిన పవన్ కళ్యాణ్
సముద్ర వనరుల సమర్థ వినియోగం ద్వారా ఆర్థిక ప్రగతి సాధన కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వనరులను పర్యావరణానికి హానికలగకుండా అందుకోగలిగిన బ్లూ ఎకానమీ గురించి చర్చించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని సచివాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, సీనియర్ పర్యావరణ శాస్త్ర వేత్తలు అవనీష్ కాంత్, పి.సిద్దార్ద లతో సమావేశమై రాష్ట్రంలో సముద్రవనరుల సమర్ధ వినియోగం, బ్లూ ఎకానమీ ప్రాజెక్ట్ అమలు అంశంపై చర్చించారు.

ఏపీలో బ్లూ ఎకానమీ ప్రాజెక్ట్ కు వరల్డ్ బ్యాంక్ సాయం కోరిన పవన్ కళ్యాణ్
ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఈ ప్రాజెక్ట్ అమలుకు వరల్డ్ బ్యాంక్ అందిస్తున్న ఆర్ధిక, సాంకేతిక సహాయాలను బ్యాంకు ప్రతినిధులు ఉపముఖ్యమంత్రికి వివరించారు. అదే తరహాలో ఈ ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు అనుకూలతలను ఆయన వారికి వివరించి వరల్డ్ బ్యాంకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
సానుకూలంగా స్పందించిన ప్రపంచ బ్యాంక్
ఇందుకు వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఈ సమాలోచన కార్యక్రమంలో నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రిసెర్చ్ సంస్థ డైరక్టర్ డా.ఎంవి.రమణమూర్తి, శాస్త్రవేత్త అల్లూరి సత్యకిరణ్ రాజు, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మెహన్ సగిలి పాల్గొన్నారు.
బ్లూ ఎకానమీ అనేది సముద్ర మరియు సముద్ర తీర పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యాన్ని కాపాడుతూ సముద్ర సంపదల అన్వేషణ, ఆర్థిక అభివృద్ధి మరియు రవాణా కోసం సముద్ర వనరుల స్థిరమైన వినియోగాన్ని సూచిస్తుంది.
బ్లూ ఎకానమీ ప్రాజెక్ట్ తో రాష్ట్రానికి సంపద
భారతదేశంలో బ్లూ ఎకానమీ వ్యవస్థ షిప్పింగ్ టూరిజం ఫిషరీస్ మరియు ఆఫ్ షోర్ ఆయిల్ మరియు గ్యాస్ అన్వేషణతో సహా అనేక రంగాలను కలిగి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సముద్ర వనరుల సమర్థ వినియోగం కోసం దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాంకు అధికారులతో చర్చలు జరిపారు. ప్రపంచ బ్యాంకు ఏపీలో బ్లూ ఎకానమీకి ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించింది.












Click it and Unblock the Notifications