Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జనసేన నేత చెంపలు వాయింపు ఘటన-శ్రీకాళహస్తికి వచ్చి తేల్చుకుంటానన్న పవన్..!

ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేనగా సాగుతున్న రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. తాజాగా వాలంటీర్లపై పవన్ చేస్తున్న వ్యాఖ్యల్ని నిరసిస్తూ వైసీపీ నేతలు రోడ్డెక్కుతుండగా.. దానికి కౌంటర్ గా జనసేన నేతలు కూడా నిరసనలు చేపడుతున్నారు. ఇదే క్రమంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో శాంతియుతంగా నిరసన చేస్తున్న జనసేన నేత ఒకరిపై మహిళా సీఐ అంజూ యాదవ్ చేయిచేసుకున్నారు. ఎడాపెడా చెంపలు వాయించేశారు. ఈ ఘటనపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇవాళ శ్రీకాళహస్తి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏలూరు జిల్లా తణుకు జనసేన నేతలతో భేటీలో మాట్లాడిన పవన్.. కాళహస్తి ఘటనను ప్రస్తావించారు. జనసేన కార్యకర్తను పోలీసులు కొట్టడం మంచిది కాదన్నారు. శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు శాంతియుతంగా ధర్నాలు చేసుకుంటుంటే అతణ్ని ఎందుకు కొట్టారని మహిళా సీఐని ప్రశ్నించారు. ఈ విషయంలో తాను ఇప్పుడు ఇంక మాట్లాడబోనని, స్వయంగా శ్రీకాళహస్తికి వచ్చి సంగతేంటో తేల్చుకుంటానని పవన్ స్పష్టం చేశారు.

pawan kalyan reacted to women cis assault on jsp leader, says will come srikalahasti and settle

ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్..ఆ తర్వాత రాయలసీమ జిల్లాల్లోనూ పర్యటించబోతున్నారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాకు వెళ్లినప్పుడు మహిళా సీఐ వ్యవహారంపై స్ధానికంగానే స్పందించాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడే దీనిపై మాట్లాడితే వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తారని, అప్పుడు విషయం గందరగోళం అవుతుందని పవన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే కాళహస్తి వచ్చి తేల్చుకుంటానని వెల్లడించారు.

జనసేన నేతపై చేయి చేసుకున్న మహిళా సీఐ అంజూ యాదవ్ తీరుపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. అధికార వైసీపీకి మద్దతుగా ఉంటూ విపక్షాలపై దాడులు చేస్తున్నారనే ఆరోపణల్ని ఎదుర్కొంటున్న ఆమె.. మరోసారి బహిరంగంగా రాజకీయ పార్టీ నేతపై చేయి చేసుకోవడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ రాబోయే రోజుల్లో కాళహస్తి టూర్ లో ఆమెపై ఎలా స్పందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+